డ‌బుల్ ఎలిమినేష‌న్: ‌బాంబు పేల్చిన బిగ్‌బాస్‌

Bigg Boss 4 Telugu: Double Elimination In This Week - Sakshi

బిగ్‌బాస్ రెండో వారంలోనే డబుల్ ఎలిమినేష‌న్ అంటూ పెద్ద‌ బాంబ్ పేల్చాడు. దీంతో నామినేష‌న్‌లో ఉన్న కంటెస్టెంట్లకు ముచ్చెమ‌లు ప‌ట్టాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్ర‌కారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల‌లో ఒక‌రిని నేటి ఎపిసోడ్‌లోనే పంపించేసిన‌ట్లు తెలుస్తోంది. ఆమె ముందుగా ఊహించిన కంటెస్టెంట్‌.. క‌రాటే క‌ళ్యాణిగా క‌నిపిస్తోంది. నిజానికి ఈ మ‌ధ్య ఆమె అంద‌రితో బాగానే ఉంటూ న‌వ్విస్తోంది. కానీ ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ ఈజ్ బెస్ట్ ఇంప్రెష‌న్ అన్న‌ట్లు హౌస్‌లో అడుగు పెట్టిన మొద‌ట్లోనే కాస్త ఎక్కువ న‌టించేస్తూ, గొడ‌వలు పెట్టుకుంటూ నెగెటివిటీ సంపాదించుకుంది. అదే ఆమెకు వెన్నుపోటు పొడిచింది.

ఇక అమ్మ రాజ‌శేఖ‌ర్ వేసే జోకుల‌కు ఇంటి స‌భ్యులు అంద‌రూ హాయిగా న‌వ్వుకుంటారు. కానీ ఈ సారి మాత్రం వీకెండ్‌లో నాగార్జున ముందు మాత్రం ఆ జోకుల‌పై సీరియ‌స్ అవుతున్నారు. దీంతో బాధ‌ప‌డ్డ మాస్ట‌ర్ తాను వెళ్లిపోతానంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు. ప్లీజ్ ప‌బ్లిక్‌, పంపించేయండి అని మోకాళ్ల‌పై మోక‌రిల్లి దండం పెట్టి మ‌రీ అభ్య‌ర్థించాడు. మ‌రి డ‌బుల్ ఎలిమినేష‌న్‌కు బ‌ల‌య్యేది మాస్ట‌రా? లేక వేరేవారా? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వ‌ర‌కు ఆగాల్సిందే. కాగా క‌ళ్యాణికి ఓట్లు వేయ‌ని నెటిజ‌న్లు కొంద‌రు ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు. ఆమె వెళ్లిపోతే ఎంట‌ర్‌టైన్‌మెంట్ త‌గ్గిపోతుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో డబుల్ ఎలిమినేష‌న్ అంటూ రాజ‌శేఖ‌ర్‌ను పంపిస్తే మాత్రం బిగ్‌బాస్‌లో వినోద‌మే ఉండ‌ద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. (అమ్మాయి పేరు క‌నిపించినా వ‌ద‌ల‌డు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top