సోహైల్‌కు హారిక పంటిగాట్లు, ఎవ్వ‌రినీ వ‌ద‌ల్లేదు

Bigg Boss 4 Telugu: Harika Cry In Good Humans Vs Demons Task - Sakshi

చింద‌ర‌వంద‌ర‌గా బిగ్‌బాస్ హౌస్‌

హౌస్‌లో రాక్ష‌సుల భీభ‌త్సం

మంచి మ‌నుషుల‌కు ముప్పు తిప్ప‌లు

నిజంగానే రాక్ష‌సిగా మారిన అరియానా

బిగ్‌బాస్ ఇంటిని కాపాడుకోవ‌డం వ‌చ్చో తెలీదో కానీ హౌస్‌ను చెడ‌గొట్ట‌మంటే మాత్రం క్ష‌ణాల్లో చేసి చూపించారు కంటెస్టెంట్లు. రాక్ష‌సులు కూడా ఇంత‌ క్రూర‌త్వంగా ప్ర‌వ‌ర్తించ‌రేమో అనిపించారు. మంచి మ‌నుషులకు ముప్పు తిప్ప‌లు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించారు. అయినా స‌రే వాటిని ఓపిక‌గా భ‌రిస్తూ స‌హ‌నంతో ఒక్కో టాస్కు పూర్తి చేస్తూ వ‌స్తున్న మ‌నుషులు విజ‌యానికి కేవ‌లం ఓ అడుగు దూరంలో ఉన్నారు. ఇంత‌కీ వాళ్లు చేసిన టాస్కులేంటి? ఏయే రాక్ష‌సుల‌ను మంచిగా మార్చార‌నేది చ‌దివేయండి..

మంచి మ‌నుషుల స‌హ‌నానికి అగ్ని ప‌రీక్ష‌
బిగ్‌బాస్ "కొంటె రాక్ష‌సుడు- మంచి మ‌నుషులు" అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌ ఇచ్చాడు. బిగ్‌బాస్‌పురం రాజ్యంలో అరియానా, అవినాష్‌, అఖిల్‌, మెహ‌బూబ్, హారిక‌ రాక్ష‌సుల టీమ్‌లో ఉండ‌గా, మిగ‌తావారు మంచి మ‌నుషుల టీమ్‌లో ఉన్నారు. ఒక్కో రాక్ష‌సుడిని మంచి మ‌నిషిగా మార్చిన ప్ర‌తీసారి రావ‌ణుడి బొమ్మ‌లోని ప‌ది త‌ల‌ల్లో రెండింటిని ప‌గ‌ల‌గొట్టాల్సి ఉంటుంది. అలా ముగ్గురు రాక్ష‌సుల‌నైనా మార్చితేనే మ‌నుషుల టీమ్ గెలిచిన‌ట్లు లెక్క. కానీ మంచి మ‌నుషుల ప‌నులకు కొంటె రాక్ష‌సుల ఆటంకం క‌లిగిస్తూ ఉంటారు. అయినా స‌రే వాళ్లు స‌హ‌నాన్ని వీడ‌కూడ‌దు. (చ‌ద‌వండి: తొలిసారి అవినాష్‌.. సోహైల్‌ రిక్వెస్ట్‌)

త‌న ప్ర‌తాపం చూపించిన అరియానా
టాస్కు ప్రారంభం అవ‌గానే అరియానా నిజ‌మైన రాక్ష‌సిలా మారిపోయింది. నోయ‌ల్‌పై గుడ్డు ప‌గ‌ల‌గొట్టినా అత‌డు కిక్కురుమ‌న‌లేదు. అవినాస్ రావ‌ణుడి పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి డైలాగులు వ‌ల్లించాడు. మెహ‌బూబ్ సోహైల్‌ను బ‌తికుండ‌గానే మ‌మ్మీలా మార్చాడు. హారిక మ‌నుషుల‌ను క్ష‌ణం కూడా ప్ర‌శాంతంగా ఉండ‌నివ్వ‌లేదు. ఇలా నానార‌కాలుగా చిత్ర‌ చిత్ర హింస‌లు పెడుతూ వారిపై ముప్పేట దాడి చేశారు. ఇక మంచి మ‌నుషుల టీమ్‌లోని నోయ‌ల్ రాక్ష‌సుల‌ను మార్చేందుకు సూక్తులు చెప్తూ నానా య‌త్నాలు చేశాడు. రాక్ష‌సుల ఆవేశాన్ని చ‌ల్లార్చేందుకు మాస్ట‌ర్ శాంతి శాంతి అంటూ మొత్తుకుంటున్నా ఆ మాట చెవినెక్కించుకునేవాళ్లే క‌రువ‌య్యారు. డ్రెస్సు లోప‌ల ఐస్ గ‌డ్డ‌లు వేసినా మాస్ట‌ర్ శాంతి జ‌పం వ‌ద‌ల్లేదు. అవినాష్ వీరావేశంతో అరుంధ‌తి డైలాగ్ చెప్పేయ‌డంతో మోనాల్ అత‌డిని హ‌త్తుకుంది.

మంచి మ‌నిషిగా మారిన రాక్ష‌సుడు అఖిల్‌
కొంటె రాక్ష‌సుల‌ను మంచిగా మార్చేందుకు బిగ్‌బాస్‌ మంచి మ‌నుషుల‌కు ఓ టాస్క్ ఇచ్చాడు. స్విమ్మింగ్ ఫూల్‌లోని పూల‌తో 50 దండాలు అల్లాల్సి ఉంటుంద‌ని తెలిపాడు. కానీ అల్లిన దండ‌ల‌ను రాక్ష‌సులు పారేస్తూ మెడ‌లో చుట్టుకుంటూ స‌ర్వ‌నాశ‌నం చేశారు. అయినా స‌రే మంచి మ‌నుషులు ఎట్ట‌కేల‌కు టాస్క్‌ను పూర్తి చేసి రాక్ష‌సుడి రెండు త‌ల‌లు పగ‌ల‌గొట్టారు. రాక్ష‌సుడిగా ఉన్న‌ అఖిల్‌ను వాళ్ల టీమ్‌లో క‌లిపేసుకున్నారు. అనంత‌రం మంచి మ‌నుషుల‌కు క్లేతో 100 ప్ర‌మిద‌ల‌ను త‌యారు చేయాల‌ని బిగ్‌బాస్ మ‌రో టాస్క్ ఇచ్చాడు. కానీ వాళ్లు దీపాలు త‌యారు చేయ‌డం మొద‌లు పెట్ట‌గానే రాక్ష‌సులు క్లేల‌ను దొంగిలించారు. (చ‌ద‌వండి: పాపం..మోనాల్‌ను మ‌ళ్లీ టార్గెట్ చేశారు)

గుట్టు చ‌ప్పుడు కాకుండా ప‌ని చేసిన నోయ‌ల్‌
నోయ‌ల్ స్టోర్ రూమ్‌లోకి వెళ్లి గ‌డియ పెట్ట‌కుని మ‌రీ దీపాలు చేస్తుండ‌టంతో మెహ‌బూబ్‌, అవినాష్ ఆ రూమ్‌లోకి చొర‌బ‌డి మ‌రీ వాటిని దొంగిలించారు. మ‌రోవైపు సోహైల్ హారిక‌ను ఆపేందుకు పట్టుకోగా ఆమె అత‌డిని పంటితో గాటు పెట్ట‌డంతో కేక‌లు పెట్టాడు. ఇక లాస్య వాళ్లు క‌ష్ట‌ప‌డి మాస్ట‌ర్ ద‌గ్గ‌ర దీపాలు దాచిపెట్ట‌గా మిగ‌తావారు అత‌డి ద‌గ్గ‌రి నుంచి లేపేశారు. అయినా స‌రే 160 దీపాలు త‌యారు చేసి విజ‌యం సాధించ‌డంతో మంచి మ‌నుషుల టీమ్‌ ఆనందం ప‌ట్ట‌లేక ఇది ఫ‌న్ అంటూ గెంతులేశారు. (చ‌ద‌వండి: నాన్న ఇస్త్రీ ప‌ని చేసేవాడు, ఇదిగో ప్రూఫ్‌: నోయ‌ల్)

త‌న పేరు ముందు చెప్ప‌లేద‌ని ఫీలైన హారిక‌
అయితే మంచి మ‌నుషుల జాబితాలో క‌లిపేస్తార‌న్న భ‌యంతో రాక్ష‌సులు అరియానా, మెహ‌బూబ్‌, అవినాష్ ఒక్క బాత్రూమ్‌లోనే దూరిపోయారు. ఇక అప్ప‌టికే మెహ‌బూబ్ పేరు చెప్పిన‌ప్ప‌టికీ అత‌డి జాడ దొరక్క‌పోవ‌డంతో చేతికి చిక్కిన హారికను మంచి మ‌నిషిగా మార్చారు. నిజానికి హారిక‌కు మ‌నిషిగా మార‌డం ఇష్ట‌మే అయిన‌ప్ప‌టికీ మొద‌ట త‌న‌ పేరు చెప్ప‌లేద‌ని ఫీల‌యింది. అలాంట‌ప్పుడు తాను మ‌నిషిగా మారినా వారికి ఎలాంటి సాయం చేయ‌ను అంటూ ఏడుస్తూ కెమెరాల‌తో చెప్పుకొచ్చింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: సోహైల్‌నే ఏడిపించిన అవినాష్‌!)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-11-2020
Nov 26, 2020, 23:24 IST
నిన్నటి ఎపిసోడ్‌లో దెయ్యం మాటల్ని లెక్క చేయలేదు ఇంటి సభ్యులు. పైగా దెయ్యంపైనే జోకులు వేస్తూ పగలబడి నవ్వారు. దీంతో...
26-11-2020
Nov 26, 2020, 20:16 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ బిగ్‌ రియాల్టీ షోకు శుభం కార్డు పడటానికి మరో నాలుగు...
26-11-2020
Nov 26, 2020, 17:09 IST
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. షో ముగింపునకు మరో 24 రోజులు మాత్రమే ఉండటంతో మిగిలిన ఎపిసోడ్స్‌ని...
26-11-2020
Nov 26, 2020, 16:14 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి దెయ్యం ఎపిసోడ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. హౌస్‌మేట్స్‌ని భయపెట్టడంతో దెయ్యం విఫలమైంది. అరియానా మొదట్లో కాస్త భయపడినా.....
25-11-2020
Nov 25, 2020, 22:59 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి దెయ్యం వచ్చింది. వింత వింత శబ్దాలు చేస్తూ ఇంటి సభ్యులను భయపెట్టే ప్రయత్నం చేసింది.అంతటితో ఆగకుండా హౌస్‌మేట్స్‌...
25-11-2020
Nov 25, 2020, 16:50 IST
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపుదశకు వచ్చింది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల...
25-11-2020
Nov 25, 2020, 15:52 IST
తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్ ముంగింపు దశకు వచ్చింది.
24-11-2020
Nov 24, 2020, 22:48 IST
ఇప్ప‌టి నుంచి హారిక‌ను జీవితంలో మ‌ర్చిపోలేను, ఆమెను అమ్మ అని పిలుస్తా..
24-11-2020
Nov 24, 2020, 16:45 IST
ఆదివారం వ‌ర‌కు స్నేహ‌గీతాలు పాడుకునే కంటెస్టెంట్లు సోమ‌వారం నాడు మాత్రం ఏదో పూన‌కం వ‌చ్చిన‌ట్లుగా శివాలెత్తుతారు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఒక‌రి మీద...
24-11-2020
Nov 24, 2020, 15:27 IST
ప‌న్నెండో వారానికి గానూ జ‌రిగిన నామినేష‌న్స్‌తో బిగ్‌బాస్ హౌస్ క‌కావిక‌లం అయింది. ఒక‌ర్ని విడిచి ఒక‌రం ఉండ‌లేం అన్న‌ట్లుగా ఉండే జంట...
23-11-2020
Nov 23, 2020, 23:24 IST
పోయిన‌సారి నామినేష‌న్ అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య చిచ్చు పెడితే ఈసారి మాత్రం అఖిల్ మోనాల్ మ‌ధ్య అగాధాన్ని సృష్టించింది. ఇద్ద‌రి...
23-11-2020
Nov 23, 2020, 20:17 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప్రారంభానికి ముందు నుంచే ఈ షోకు లీకుల బెడ‌ద ప్రారంభ‌మైంది. సీజ‌న్ ప్రీమియ‌ర్ ఎపిసోడ్‌కు ముందే ఎవ‌రెవ‌రు...
23-11-2020
Nov 23, 2020, 19:18 IST
బిగ్‌బాస్ ప్ర‌యాణం ముగింపుకు వ‌చ్చే కొద్దీ ఇంట్లో లెక్క‌లు మారుతున్నాయి. ముఖ్యంగా సీక్రెట్ రూమ్ ఘ‌ట్టం నుంచి అఖిల్ గ్రాఫ్...
23-11-2020
Nov 23, 2020, 18:04 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌న్నెండో వారంలోకి అడుగు పెట్టింది. ప్ర‌స్తుతం హౌస్‌లోఏడుగురు కంటెస్టెంట్లు మాత్ర‌మే మిగిలారు. రోజులు త‌గ్గేకొద్దీ వారి...
22-11-2020
Nov 22, 2020, 23:15 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ప‌ద‌కొండో వారంలో లాస్య జున్నును క‌లిసేందుకు ఇంటికి వెళ్లిపోయింది. అస‌లే లాస్య ఇల్లు విడిచి 70 రోజులు...
22-11-2020
Nov 22, 2020, 18:03 IST
బిగ్‌బాస్ ఇచ్చే టాస్కులు ఒక‌త్తైతే అంద‌రికీ వండి పెట్ట‌డమ‌నేది మ‌రో ఎత్తు. మొద‌టి విష‌యాన్ని ప‌క్క‌న పెడితే బిగ్‌బాస్ హౌస్‌లో...
22-11-2020
Nov 22, 2020, 16:50 IST
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన రియాలిటీ షోగా‌ బిగ్‌బాస్ త‌న పేరు లిఖించుకుంది. ఏ యేటికాయేడు రెట్టింపు ఉత్సాహంతో...
22-11-2020
Nov 22, 2020, 15:54 IST
నిన్న ఫ్యామిలీ ఎపిసోడ్‌తో కంటెస్టెంట్ల‌ను హుషారెత్తించిన నాగ్ నేడు వారితో గేమ్స్ ఆడించేందుకు రెడీ అయ్యారు. ఇంటిస‌భ్యులు సైతం రెట్టింపు...
21-11-2020
Nov 21, 2020, 23:22 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో మ‌రోసారి ఫ్యామిలీ ఎపిసోడ్ న‌డిచింది. కాక‌పోతే వ‌చ్చిన‌వారితో కూడా నాగార్జున గేమ్ ఆడించారు. ఎవ‌రు టాప్...
21-11-2020
Nov 21, 2020, 20:33 IST
బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఓ ర‌కంగా అదృష్ట‌వంతులు. క‌రోనా దూర‌ని కుటీరంలా బిగ్‌బాస్ హౌస్ వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తోంది....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top