బిగ్‌బాస్‌-4: 15 మంది కంటెస్టెంట్స్‌ వీళ్లే!

Bigg Boss 4 Telugu Contestants List - Sakshi

బిగ్‌బాస్‌-4 ఫీవర్‌ మొదలైంది. మరికొద్ది గంటల్లో బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా 15 మంది కంటెస్టెంట్స్‌ 100 రోజుల పాటు సందడి చేయబోతున్నారు. సెప్టెంబర్‌ 6 తేదీ నుంచి.. అంటే రేపటి నుంచి బిగ్‌బాస్‌ 4 టెలికాస్ట్‌ మొదలుకానుంది. ఇప్పటికే క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న కంటెస్టెంట్స్‌ అంతా సెప్టెంబర్‌ 3వ తేదీన హోస్‌లోకి వెళ్లిపోయారు. శుక్రవారం నుంచి షూటింగ్‌ మొదలైంది. అంటే ఆల్రెడీ  ఆట మొదలైపోయిందన్నమాట. 
(చదవండి : బిగ్‌బాస్‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు!)

ఇప్పటికే బిగ్‌బాస్‌ -4 కంటెస్టెంట్స్‌ వీళ్లే అంటూ రకరకాల పేర్లు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేశాయి. దాదాపు నెల రోజుల నుంచి బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే అంటూ కొందరి పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని కొందరు కొట్టిపడేశారు. ఇప్పటికే బిగ్‌బాస్‌-4లో తాము నటించడం లేదంటూ హీరో తరుణ్‌, హీరోయిన్‌ శ్రద్ధాదాస్‌,  కల్పిక గణేశ్,  నటి సునైనా, సింగర్‌ సునీత లాంటి వాళ్లు తేల్చి చెప్పారు. అయితే తాజాగా మరో లిస్ట్‌ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్స్‌ పక్కా వీళ్లే అంటూ 15 మంది పేర్లు సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్నాయి.  

బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్స్‌ వీళ్లే

1 దేత్తడి హారిక (యూట్యూబ్‌ స్టార్‌)

2 దేవి నాగవల్లి (యాంకర్‌)

3 గంగవ్వ (యూట్యూబ్‌ స్టార్‌)

4 ముక్కు అవినాష్‌ (జబర్దస్త్ ఫేం)

5 మోనాల్‌ గుజ్జార్‌ (హీరోయిన్‌)

6 అమ్మ రాజశేఖర్‌( సినీ దర్శకుడు)

7 కరాటే కళ్యాణి (నటి)

8 నోయల్‌(సింగర్‌)

9 సూర్యకిరణ్‌ (సినీ దర్శకుడు)

10 లాస్య (యాంకర్‌)

11 జోర్దార్ సుజాత (యాంకర్)

12  తనూజ పుట్టస్వామి (బుల్లి తెర నటి, ముద్దమందారం ఫేమ్)

13 సయ్యద్ సోహైల్ (టీవీ నటుడు)

14 అరియానా గ్లోరీ (యాంకర్‌, జెమిని కెవ్వు కామెడీ యాంకర్)

15 అభిజిత్‌ (లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్ సినిమా హీరో)

వీరితో పాటు నటి సురేశ వాణి, మెహబూబా దిల్‌ సే(టిక్ టాక్ షార్ట్ ఫిల్మ్ స్టార్), పేర్లు కూడా లిస్ట్‌లో వినిపిస్తున్నాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top