అరియానాను ఇర‌కాటంలో ప‌డేసిన బిగ్‌బాస్‌

Bigg Boss 4 Telugu: Captaincy Task Between Ariyana And Avinash - Sakshi

కంటెస్టెంట్లు క‌లిసిపోయేలా బిగ్‌బాసే ప్లాన్ చేస్తాడు. మ‌ళ్లీ వారిని విడ‌దీసేందుకు ప‌థ‌కాలు ర‌చిస్తాడు. స్నేహితుల మ‌ధ్య నామినేష‌న్ చిచ్చు పెడ‌తాడు. ఇలా హౌస్‌లో జ‌రిగే అన్నింటికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ బిగ్‌బాస్. కాగా ఇంట్లో అరియానా, అవినాష్ మ‌ధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే. రాక్ష‌సుల టాస్కులోనూ వీరిద్ద‌రూ రెచ్చిపోయి ఆడుతూ విజ‌యానికి అడుగు దూరంలో ఆగిపోయారు. కానీ టాస్కులో బెస్ట్ ప‌ర్ఫార్మ‌ర్లుగా నిలిచి కెప్టెన్సీ కోసం త‌ల‌ప‌డనున్నారు. అరియానా బ‌లాబ‌లాలు తెలిసిన అవినాష్ ఆమెతో ముందుగానే డీల్ కుదుర్చుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. 'నువ్వు కెప్టెన్ అయితే నేను అసిస్టెంట్ కెప్టెన్' అని చెప్పుకొచ్చాడు. కానీ ఆమె మాత్రం "ఒక‌వేళ నేను గెలిస్తే అమ్మ‌తోడు నీకు చుక్క‌లు చూపిస్తా"న‌ని వార్నింగ్ ఇచ్చింది. (చ‌ద‌వండి: నువ్వు పెద్ద తోపు, తురుమేం కాదు: అఖిల్‌)

ఇక అఖిల్ అరియానాను చేయి ప‌ట్టుకుని ద‌గ్గ‌ర‌కు తీసుకుంటే అవినాష్ త‌ట్టుకోలేక‌పోయాడు. ప్లీజ్ చేయి తీసేయ‌ని అడిగితే అఖిల్ మ‌రింత ద‌గ్గ‌ర‌గా ప‌ట్టుకున్నాడు. దీంతో అత‌డు మోనాల్‌ను ప‌ట్టుకోబోతే ఆమెను కూడా ద‌గ్గ‌ర‌కు తీసుకుని హ‌త్తుకుంటూ అవినాష్‌ను మ‌రింత ఉడికించాడు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన‌ కెప్టెన్సీ టాస్కులో శ‌క్తిసామ‌ర్థ్యాలు చూపించాల్సి ఉంటుంది. మ‌రి ఈ టాస్కులో ఎవ‌రు ఎవ‌రికి స‌పోర్ట్ చేశార‌నేది చూడాలి. మ‌రోవైపు ఒక‌టే టీ ష‌ర్టును మార్చి మార్చి వేసుకుంటున్న అభిజిత్ దుస్తుల‌ను బిగ్‌బాస్ తిరిగి పంపించాడు. కానీ ఓ ట్విస్టు ఇచ్చాడు. రేష‌న్ కావాలా? అభిజిత్ సూట్‌కేసు కావాలా? అని అరియానాను అడిగాడు. దీన్ని బ‌ట్టి అరియానా కెప్టెన్సీ టాస్క్‌లో ఓడిపోయి రేష‌న్ మేనేజ‌ర్‌గా ఎన్నికైన‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి ఆమె ఒక్క‌రి కోసం అంద‌రికీ అవ‌స‌ర‌మ‌య్యే స‌రుకును త్యాగం చేస్తుందా? లేదా అభి సూట్‌కేసును వెన‌క్కు పంపించేసి రేష‌న్ సామాను తీసుకుంటుందా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: కుమార్ సాయిని గెంటేశారు!)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top