ట్ర‌యాంగిల్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తున్న అభి!

Bigg Boss 4 Telugu: Abhijeet Says Lets Break Our Relationship Monal - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో మోనాల్ వ్య‌వ‌హారమే అన్నిటిక‌న్నా బాగా హైలెట్ అవుతోంది. అటు అఖిల్‌తో, ఇటు అభిజిత్‌తో ఉంటూ ఆమె త‌న‌కు తానుగా చెడ్డ‌పేరు తెచ్చుకోవ‌డ‌మే కాకుండా వాళ్లిద్ద‌రికీ కూడా కొత్త స‌మ‌స్య‌లు తెచ్చిపెడుతోంది. నిజానికి మొద‌ట్లో అఖిల్‌, అభిజిత్ మ‌రీ అంత శ‌త్రువులుగా ఉండేవారు కాదు. కానీ మోనాల్ వ‌ల్ల వీరిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి వ‌చ్చింది. దీని వ‌ల్ల అటు ఆమెకు, ఇటు వీళ్ల‌కు మ‌న‌శ్శాంతి లేకుండా పోయింది. ఈ క్ర‌మంలో అభిజిత్ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. ద‌గ్గ‌ర‌గా ఉండి ఇబ్బందులు ప‌డేక‌న్నా దూరంగా ఉండ‌ట‌మే మంచిద‌న్న అభిప్రాయానికి వ‌చ్చాడు. 

ప‌గ‌లంతా అఖిల్‌తో, రాత్ర‌వ‌గానే అభితో
ఇప్ప‌టివ‌ర‌కు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా ఈ ట్ర‌యాంగిల్ స్టోరీలో మోనాల్‌నే త‌ప్పు ప‌ట్టారు. ఆమె మ‌నుషుల ఎమోష‌న్స్‌తో ఆడుకుంటోంద‌ని విమ‌ర్శించారు. పైగా ప‌గ‌లంతా అఖిల్‌తో, రాత్ర‌వ‌గానే అభిజిత్‌తో ముచ్చ‌ట్లు పెడుతుంద‌ని పేర్కొన్నారు. ఇదిలా వుంటే నాగార్జున కూడా మోనాల్ విష‌యంలో త‌నపై సెటైర్లు వేయ‌డం, గ‌త నామినేష‌న్‌లో త‌న త‌ప్పు కూడా ఉంద‌ని ఆమె అంద‌రి ముందు చెప్ప‌డం అభిజిత్‌కు మింగుడు ప‌డ‌లేదు. ఈ వ్య‌వ‌హారం ఏదో తేడా కొడుతోంద‌ని అనుమానించాడు. మోనాల్‌తో దూరంగా ఉండేందుకు డిసైడ్ అయ్యాడు. ఇదే విష‌యాన్ని ఆమె ఎదుట ప్ర‌స్తావించి, ఆమె అభిప్రాయాన్ని అడిగాడు. కానీ ఆమె ఏమీ చెప్ప‌కుండా నిస్తేజంగా ఉండిపోయింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: సుజాత అవుట్‌!)

క‌లిసిపోండ‌న్న నోయ‌ల్‌, విడిపోతామ‌న్న అభి
ఈ గొడ‌వ ఓ కొలిక్కి వ‌చ్చేలా క‌నిపించ‌క‌పోవ‌డంతో వీరి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు నోయ‌ల్ ప్ర‌య‌త్నించాడు. అన్నీ మర్చిపోయి కొత్త స్నేహితుల్లా ఉండండి, కొత్త జ‌ర్నీ స్టార్ చేయండి అంటూ కొన్ని మంచి మాట‌లు చెప్పాడు. కానీ అభిజిత్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. మ‌న‌తో ఇబ్బంది ఉన్న‌ప్పుడు క‌ట్ చేయ‌డ‌మే బెట‌ర్ అంటూ కుండ బ‌ద్ధ‌లు కొట్టేశాడు. నీ సంతోషం నీది, నా సంతోషం నాది అంటూ విడిపోదామ‌ని మోనాల్‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పేందుకు ప్ర‌య‌త్నించాడు. అలాగే తాను మధ్య‌లో కామెడీ అవ‌డం ఇష్టం లేద‌ని తేల్చి చెప్పాడు. నువ్వు ఎవ‌రితోనైనా ఉండు, అది పూర్తిగా నీ ఇష్ట‌మ‌ని, త‌న‌కెలాంటి అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేశాడు. (చ‌ద‌వండి: ఇక్కడ రిలేష‌న్స్ పెట్టుకోవ‌డం వేస్ట్‌: అఖిల్‌)

అభిని దూరం చేసుకోలేక మోనాల్ అంత‌ర్మ‌థ‌నం
కానీ అభితో తెగ‌దింపులు చేసుకోవ‌డం ఇష్టం లేని మోనాల్ ఏం స‌మాధానం చెప్పాలో తెలీక‌ శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అభిజిత్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ఆచ‌ర‌ణ‌లో పెడితే మోనాల్ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణం ముగిసిన‌ట్లే అవుతుంది. అఖిల్‌కు లైన్ క్లియ‌ర్ అవుతుంది. కానీ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్న మోనాల్ నిజ‌స్వ‌రూపాన్ని చూసి అఖిల్ కూడా ఆమెను న‌మ్మ‌డానికి వెన‌క‌డుగు వేస్తున్నాడు. మ‌రి ఇద్ద‌రి ద‌గ్గ‌ర న‌మ్మ‌కం కోల్పోయిన మోనాల్ ఇప్పుడు ఏ దారిని ఎంచుకుంటుంది? ఎవ‌రి చెంత‌కు చేర‌నుంది? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. (చ‌ద‌వండి: అఖిల్‌, మోనాల్‌ను గంగ‌వ్వ విడ‌దీస్తోందా?)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top