డ్రగ్స్‌ కేసులో ముగ్గురు బడా హీరోలు!

Big Heroes Names in Bollywood Drugs Case - Sakshi

న్యూఢిల్లీ: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నటీమణుల పేర్లే ఇప్పటిదాకా తెరపైకి వచ్చాయి. రియా చక్రవర్తి, దీపికా పదుకొణె, రకుల్‌ప్రీత్‌ సింగ్, సారా అలీఖాన్‌ తదితరులను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ఇప్పటికే విచారించింది. కొందరు హీరోయిన్ల మొబైల్‌ ఫోన్లలో గతంలో డిలీట్‌ అయిన డేటాను ఎన్‌సీబీ తాజాగా పునరుద్ధరించింది. డ్రగ్స్‌ వినియోగానికి సంబంధించి ఇందులో కీలక వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా డ్రగ్స్‌ వ్యవహారంలో బాలీవుడ్‌ ముగ్గురు ప్రముఖ హీరోలు భాగస్వాములేనని ఎన్‌సీబీ గుర్తించింది. బడా హీరోలుగా చెలామణి అవుతున్న కొందరు డ్రగ్స్‌ ఉపయోగిస్తున్నట్లు పక్కా ఆధారాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే వారందరికీ సమన్లు జారీ చేసి, ఎన్‌సీబీ విచారించనుంది. సదరు బడా హీరోలు నోరు విప్పితే మొత్తం గుట్టు రట్టు కావడం ఖాయం. ప్రస్తుతం వారందరి ఫోన్లపై ఎన్‌సీబీ నిఘా పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

డ్రగ్స్‌ కేసుకు సంబంధించి తన పేరును మీడియా కథనాలలో చర్చించకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఆశ్రయించిన నేపథ్యంలో స్టేటస్‌ రిపోర్టులు దాఖలు చేయాలని కేంద్రాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. మరోవైపు నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును బాంబే హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. (చదవండి: 3 వేలు ఉన్న రియా ఖాతాలోకి లక్షలు?)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top