Acharya Movie Bhale Bhale Banjara Lyrical Song Out Now - Sakshi
Sakshi News home page

Acharya: ఆచార్య మూవీ నుంచి ‘భలే భలే బంజారా’ సాంగ్ రిలీజ్‌

Apr 18 2022 5:36 PM | Updated on Apr 18 2022 6:24 PM

Bhale Bhale Banjara Full Video Song From Acharya Out Now - Sakshi

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. మెగాప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇందులో సిద్ధ అనే పాత్ర‌లో న‌టించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ‘ఆచార్య’చిత్రం ఈనెల 29 రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచింది చిత్ర బృందం. తాజాగా ఈ సినిమా నుంచి  `భలే భలే బంజారా` అనే పాటని విడుదల చేశారు.

సాధారణంగానే మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ల డ్యాన్స్‌ చూసి మెగా ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోతుంటారు. అలాంటిది వీరిద్దరు కలిసి డ్యాన్స్‌ చేస్తే అది అభిమానులకు పండుగే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి విజువల్‌ ట్రీట్‌నే ఇచ్చారు మేకర్స్‌.  ఈ పాటలో ఇందులో చిరంజీవి, రామ్‌చరణ్‌లు పోటీ పడి డ్యాన్స్‌ చేయడం అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంటుంది.

రామ‌జోగ‌య్య‌శాస్త్రి రాసిన ఈ పాట‌ను లెజెండ్ సింగ‌ర్ శంక‌ర్ మ‌హ‌దేవ‌న్‌, టాలీవుడ్ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించగా, రామ్‌చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది.  కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ బ్యాన‌ర్ల‌పై నిరంజ‌న్ రెడ్డి , అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement