Acharya Bhale Bhale Banjara Song: ఆచార్య నుంచి ‘భలే భలే బంజారా’ ఫుల్‌ సాంగ్‌ అవుట్‌

Bhale Bhale Banjara Full Song Released From Acharya Movie - Sakshi

Acharya Movie Bhale Bhale Banjara Full Song Out: చిరంజీవి, రామ్‌చరణ్‌​ నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్‌29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఇక త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో సందడి చేయబోతోంది. ఇదిలా ఉంటే విడుదలకు ముందు విడుదలైన ఆచార్య పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 

చదవండి: అందుకే చెల్లెలి పాత్రలు చేస్తున్నా: కీర్తి సురేశ్‌

మణిశర్మ అందించిన సంగీతం, ఆయన కట్టిన బాణీలకు సంగీత ప్రియుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆచార్యలోని ‘భలే భలే బంజారా’ ఫుల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. నక్సలైట్లుగా ఉన్న ఆచార్య-సిద్ధ బృందంపై రాత్రివేళలో గిరిజన గూడెంలో చిత్రీకరించిన పాట ఇది. అడవీ ప్రాంతంలో ఓ వెన్నెల రాత్రిలో నక్సలైట్స్ సరదాగా ఆడిపాడితే ఎలా ఉంటుందనేది ఈ పాటలో చూపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించిన ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించారు. శంకర్ మహదేవన్, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top