Bhagyashree Dancing Video Viral Tittar Bittar From Son Abhimanyu Dassani Movie - Sakshi
Sakshi News home page

Meenakshi Sundareshwar: సినిమా హిట్‌ టాక్‌ హీరోయిన్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌

Nov 8 2021 4:17 PM | Updated on Jun 24 2022 1:05 PM

Bhagyashree Dancing Video Viral Tittar Bittar From Son Abhimanyu Dassani Movie - Sakshi

కుమారుడు అభిమన్యు దాసాని  సినిమాలోని  మీనాక్షి సుందరేశ్వర్‌లోని ఒక పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ అలనాటి అందాల నటి భాగ్యశ్రీచేసింది.  టిట్టర్ బిట్టర్ పాటకు డ్యాన్స్ చేస్తున్న ఈ  వీడియో ఇపుడు నెట్టింట్‌ హల్‌ చల్‌ చేస్తోంది.  

సాక్షి,ముంబై: ‘మైనే ప్యార్ కియా’ అంటూ బాలీవుడ్‌ డెబ్యూ మూవీతోనే అదరగొట్టిన అలనాటి అందాల నటి భాగ్యశ్రీ పుత్రోత్సాహంతో పొంగిపోతోంది. తన కుమారుడు అభిమన్యు దాసాని  సినిమాలోని  మీనాక్షి సుందరేశ్వర్‌లోని ఒక పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. టిట్టర్ బిట్టర్ పాటకు డ్యాన్స్ చేస్తున్న ఈ  వీడియోను ఇపుడు నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది.  

తన వారసుడి సినిమాను సెలబ్రేట్‌ చేసుకుంటూ తన సంతోషాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది “కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభం! నా కొడుకు మొదటి నెట్‌ఫ్లిక్స్ చిత్రం మీనాక్షి సుందరేశ్వర్ విడుదలైంది. ఇప్పటికే ప్రేమను కురిపించిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా చూడకపోతే, మీ ప్రియమైన వ్యక్తితో, సినిమా చూసేయండి..పాప్‌కార్న్ తింటూ మళ్లీ ప్రేమలో పడండి.  మీ ఆశీర్వాదాలకు అందరికీ ధన్యవాదాలు’’అని పేర్కొంది.  దీంతోపాటు మైనే ప్యార్‌కియా చిత్ర జ్ఞాపకాలను కూడా  సోమవారం  సోషల్‌ మీడియాలో పంచుకుంది. ప్రేమ్‌, సుమన్‌లను సజీవంగా  గుండెల్లో దాచుకున్నందుకు  సినీ అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్బంగా సల్మాన్‌ ఖాన్‌తో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్‌ చేయడం విశేషం.

కాగా మీనాక్షీ సుందరేశ్వర్ మూవీకి మనోహరమైన హృద్యమైన చాలా గొప్ప చిత్రం అlo ప్రశంసలు లభిస్తున్నాయి. నేటితరం హీరోల మాదిరిగా కాకుండా, చాలా డిగ్నిఫైడ్‌గా ఉన్నాడంటూ భాగ్యశ్రీ కుమారుడుడు, అభిమన్యు దసానీ ముద్దపప్పులా ఈ పాత్రకి సరిపోయాడనే కమెంట్స్‌ వినిపిస్తున్నాయి.  దంగల్ బ్యూటీ  సన్యా మల్హోత్రా  దసానీకి జోడీగా నటించింది. తమిళ మధ్య తరగతి నేపధ్యంతో తెరకెక్కిన  ఈ మూవీకి దర్శకుడు వివేక్ సోనీ.

కాగా అభిమన్యు దాసాని 2018లో వాసన్ బాలా చిత్రం మర్ద్ కో దర్ద్ నహీ హోతాతో అరంగేట్రం చేశాడు. నికమ్మ, ఆంఖ్ మిచోలీలో కనిపించనున్నాడు.  మరోవైపు సల్మాన్‌ ఖాన్‌ సరసన​ బ్లాక్‌బస్టర్‌ మూవీలో నటించిన తరువాత చాలా సంవత్సరాలు నటనకు దూరంగా ఉన్న భాగ్యశ్రీ ఇటీవల కంగనా రనౌత్ చిత్రం తలైవిలో కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement