సినిమా షూటింగ్‌లో ఎన్నికల ప్రచారం  | Beti Subhash Reddy Election campaign In Film Shooting | Sakshi
Sakshi News home page

సినిమా షూటింగ్‌లో ఎన్నికల ప్రచారం 

Mar 7 2021 11:17 AM | Updated on Mar 7 2021 11:32 AM

Beti Subhash Reddy Election campaign In Film Shooting - Sakshi

రామంతాపూర్‌: రామంతాపూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో శనివారం జరిగిన తెలుగు సినిమా షూటింగ్‌కు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని షూటింగ్‌లో పాల్గొన్న హీరో సుధీర్‌బాబు, డైరెక్టర్‌ కర్ణ కుమార్, ప్రొడ్యూసర్‌ చల్లా విజయ్‌కుమార్‌లను ఆయన కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గడ్డం రవికుమార్, సుధాకర్, సాంబశివరావు, జేసీబీ రాజు, అంగడి సాయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement