Bengali Actor Sonali Chakraborty Dies At Age Of 59 In Kolkata - Sakshi
Sakshi News home page

Bengali Actor Sonali: ప్రముఖ బుల్లితెర నటి మృతి.. సీఎం సంతాపం

Oct 31 2022 4:37 PM | Updated on Oct 31 2022 5:04 PM

Bengali Actor Sonali Chakraborty dies at The Age Of 59 - Sakshi

ప్రముఖ బెంగాలీ నటి సోనాలీ చక్రవర్తి(59) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె భర్త శంకర్‌ కూడా నటుడే కాగా.. వారికి ఓ కుమార్తె ఉన్నారు. బెంగాలీ అభిమానులకు సుపరిచితురాలైన సోనాలి కాలేయ సమస్యలతో బాధపడుతోందని ఆమె భర్త తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

(చదవండి: వాటిని నేను పట్టించుకోను.. కాంతార హీరో రిషబ్‌ శెట్టి)

బెంగాలీకి చెందిన బుల్లితెర నటి సోనాలీ దాదర్ కీర్తి (1980), హర్ జీత్ (2002), చోఖేర్ బాలి (2003), బంధన్ (2004) వంటి చిత్రాలలో కూడా కనిపించారు. చివరగా ఆమె నటించిన మెగా సీరియల్ గాట్చోరలో కనిపించింది. ఆమె మృతి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement