Avika Gor Shared Her Transformation Pics In Bikini Goes Viral | ఫాలోవర్లను ఆశ్చర్యపరిచిన హీరోయిన్‌! - Sakshi
Sakshi News home page

ఫాలోవర్లను ఆశ్చర్యపరిచిన హీరోయిన్‌!

Jan 8 2021 1:34 PM | Updated on Jan 8 2021 5:00 PM

Balika Vadhu Actress Avika Gor Pic Weight Loss Transformation - Sakshi

ముంబై: ‘బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు)’ సీరియల్‌తో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది అవికా గోర్‌. ‘ఆనంది’గా సహజమైన నటనతో కట్టిపడేసి ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ సీరియల్‌ ఎన్ని భాషల్లో డబ్‌ అయినప్పటికీ తెలుగులో వచ్చినంత గుర్తింపు మరెక్కడా రాలేదు. దీంతో ఆమెకున్న క్రేజ్‌ దృష్ట్యా టాలీవుడ్‌ నిర్మాతలు.. ‘ఉయ్యాల జంపాల’ మూవీతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేశారు. తొలి సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన అవికాకు.. సినిమా చూపిస్తా మామాతో కెరీర్‌లో భారీ హిట్‌ పడింది. అప్పటి నుంచి అడపాదడపా సిల్వర్‌ స్క్రీన్‌పై తళుక్కుమన్న ఆమె తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

‘ఈ ఇడియట్‌ నావాడు’ అంటూ తన ప్రియుడు మిలింద్ చంద్వానీని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేసింది. అంతేగాక బొద్దుగుమ్మ నుంచి నాజూకుగా మారిన ఆమె అధిక బరువు కారణంగా తాను ఎదుర్కొన్న విమర్శల గురించి పలు పోస్టులు పెడుతూ ట్రాన్స్‌ఫర్మేషన్‌ జర్నీ గురించి పంచుకుంది. ఈక్రమంలో గురువారం ఓ స్టన్నింగ్‌ ఫొటోతో తన ఫాలోవర్లను ఆశ్చర్యపరిచింది అవికా. కెరీర్‌ ఆరంభం నుంచి ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించిన ఈ అమ్మడు.. బికినీలో దర్శనమిచ్చింది. అవిక పోస్టుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. బరువు తగ్గడానికి నువ్వు చూపిన అంకితభావం గొప్పదంటూ కొంతమంది ప్రశంసిస్తుండగా.. మరికొంత మంది మాత్రం సినిమా అవకాశాల కోసమే ఇలా స్కిన్‌ షో చేస్తోందని, ఇప్పుడిక దక్షిణాది దర్శకనిర్మాతలు ఆమెను సీనియర్‌ హీరోల సరసన నటింపజేస్తారంటూ ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement