దంగల్‌ ఆడిషన్‌.. నన్ను సెలక్ట్‌ చేయలేదు: హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

Avneet Kaur: ఆ రెండు సినిమాల ఆడిషన్‌కు వెళ్లా.. ఆమిర్‌ ఖాన్‌ అక్కడే ఉన్నాడు..

Published Thu, Feb 29 2024 5:04 PM

Avneet Kaur meets Aamir Khan at Laapataa Ladies premiere and Remembers Her Audition - Sakshi

ఎక్కువ ఏళ్లు ఇండస్ట్రీలో నెట్టుకురావడం అనేది అంత ఈజీ కాదు! కానీ అది అసాధ్యమేమీ కాదని, తలుచుకుంటే సుసాధ్యమవుతుందని నిరూపించింది బాలీవుడ్‌ నటి అవనీత్‌ కౌర్‌. చిన్నప్పుడు 'డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌' షోలో చిన్ని డ్యాన్సర్‌గా అలరించింది. ఎనిమిదేళ్ల వయసులోనే పలు డ్యాన్స్‌ రియాలిటీ షోలలో పాల్గొంది. తర్వాతి కాలంలో డ్యాన్సర్‌గానే కాకుండా నటిగానూ అలరిస్తూ వస్తోంది.

ఆ సినిమాలకు రిజెక్ట్‌..
మేరీ మా, సావిత్రి ఏక్‌ ప్రేమ్‌ కహాని సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. అలాద్దీన్‌ సీరియల్‌లో హీరోయిన్‌గా నటించి ఫుల్‌ క్రేజ్‌ సంపాదించింది. అలా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బ్రూనీ, ఏక్తా, మర్దానీ 2  వంటి సినిమాలతో పాటు పలు సిరీస్‌లలోనూ యాక్ట్‌ చేసింది. అయితే కొన్ని ఆడిషన్స్‌లో తనను రిజెక్ట్‌ చేశారంటోందీ బ్యూటీ. తాజాగా ఆమె స్టార్‌ హీరో నిర్మించిన లాల్‌పట్టా లేడీస్‌ సినిమా ప్రీమియర్‌కు హాజరైంది. ఈ క్రమంలో అక్కడున్న ఆమిర్‌ను కలిసింది.

ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు కలిశా
అయితే ఆయన్ను కలవడం ఇదే మొదటిసారి కాదని చెప్పుకొచ్చింది. దంగల్‌, సీక్రెట్‌ సూపర్‌స్టార్‌ సినిమాల ఆడిషన్స్‌కు వెళ్లానని, అప్పుడు ఆయన్ను కలిశానంది. ఆ రెండు సినిమాలకు ఆడిషన్‌ ఇచ్చానని, వర్క్‌షాప్‌కు కూడా వెళ్లానని కానీ తనను సెలక్ట్‌ చేయలేదని తెలిపింది. అయితే ఆమిర్‌ మాత్రం తనను మెచ్చుకున్నాడని చెప్తూ ఉబ్బితబ్బిబైపోయింది. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

చదవండి: మనసు మార్చుకున్న బ్యూటీ.. బోల్డ్‌ సీన్స్‌కు పచ్చజెండా.. ఆ సీన్‌ అందుకే చేశానంటూ..

Advertisement
 
Advertisement
 
Advertisement