Avatar2 : అవతార్‌-2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన టికెట్‌ రేట్స్‌

Avatar2 The Way Of Water Ticket Prices Redueced - Sakshi

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’. డిసెంబర్‌ 16న విడుదలైన ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియాలోనూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోందీ చిత్రం. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి.. వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

మరోవైపు ఈ సినిమా టికెట్‌ రేట్స్‌ మరీ ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవతార్‌ మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌ ఒకటి బయటకు వచ్చింది. అవతార్‌-2 త్రీడీ వెర్షన్‌ టికెట్‌ ధరలు భారీగా తగ్గాయి. IMAX, 4DX వెర్షన్లు కాకుండా 3డీ వెర్షన్‌ టికెట్‌ ధరను రూ.150కి తగ్గించారు.

ప్రేక్షకుల సంఖ్యను మరింత పెంచేందుకు తాజాగా తీసుకున్న టికెట్‌ తగ్గింపు నిర్ణయం కలెక్షన్లు పెరిగేందుకు బాగా ఉపయోగపడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అవతార్‌-2 ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి మరి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top