తెలుగుమ్మాయిని.. సపోర్ట్‌ చేయాలి కానీ ట్రోలింగ్‌..: అవంతిక | Avantika Vandanapu About Her American Accent Trolling | Sakshi
Sakshi News home page

Avantika Vandanapu: ఇంత దారుణమైన ట్రోలింగ్‌ ఎప్పుడూ చూడలేదు.. నటి ఎమోషనల్‌

Mar 16 2024 3:58 PM | Updated on Mar 16 2024 4:26 PM

Avantika Vandanapu About Her American Accent Trolling - Sakshi

నేను అమెరికన్‌ యాక్సెంట్‌లో మాట్లాడుతుంటే చాలామంది ట్రోల్‌ చేస్తున్నారు. అదెందుకో నాకే అర్థం కావడం లేదు. నేను అక్కడే పుట్టిపెరిగాను కాబట్టి నాకు యాస అలాగే

అవంతిక వందనపు.. ఈ మధ్య బాగా మార్మోగిపోతున్న పేరు. 'బ్రహ్మోత్సవం' అనే సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. ఇందులో మహేశ్‌బాబు చెల్లిగా కనిపించిన అవంతిక తర్వాత 'మనమంతా', 'ప్రేమమ్‌' సినిమాల్లో కనిపించింది. అలా తెలుగులో బాలనటిగా కొన్ని సినిమాలు చేసిన ఈమె 2021లో హీరోయిన్‌గా స్పిన్‌ అనే మూవీ చేసింది. అప్పటినుంచి అన్నీ హాలీవుడ్‌ సినిమాలే చేస్తోంది. ఇటీవలే మీన్‌ గర్ల్స్‌ అనే చిత్రంలో కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో అవంతిక అమెరికా యాక్సెంట్‌లో మాట్లాడటంతో చాలామంది తనను ట్రోల్‌ చేశారు.

పదేళ్ల వయసులో..
దీనిపై అవంతిక స్పందిస్తూ.. 'అమ్మది హైదరాబాద్‌, నాన్నది నిజామాబాద్‌.. కానీ నేను పుట్టిపెరిగింది అమెరికాలో! నాకు 10 ఏళ్లు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు షిఫ్టయ్యాం. ఇక్కడికి వచ్చాక సినిమా అవకాశాలు రావడంతో ఐదేళ్లు ఇక్కడే ఉన్నాం. అమ్మ నాకోసమే ఉద్యోగం వదిలేసింది. నేను అమెరికన్‌ యాక్సెంట్‌లో మాట్లాడుతుంటే చాలామంది ట్రోల్‌ చేస్తున్నారు. ఎందుకో నాకే అర్థం కావడం లేదు. నేను అక్కడే పుట్టిపెరిగాను కాబట్టి నాకు యాస అలాగే వస్తుంది. తెలుగమ్మాయి హాలీవుడ్‌లో సక్సెస్‌ అవుతుందంటే సపోర్ట్‌ చేయాలి కానీ ఇలా విమర్శించడం కరెక్ట్‌ కాదు.

హీరోయిన్‌గా..
ట్రోల్స్‌ను మనం ఎప్పుడూ కంట్రోల్‌ చేయలేం. కానీ ఇంత దారుణమైన ట్రోలింగ్‌ను నేనింతవరకు చూడలేదు. అయితే అమెరికాలో నెపోటిజం లేదు. టాలెంట్‌ను బట్టే ఛాన్సులు ఇస్తారు. కానీ నాకు ఇక్కడ హీరోయిన్‌గా రాణించాలనుంది. సౌత్‌లో, బాలీవుడ్‌లో సినిమాలు చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది. అవంతిక నటించిన 'బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై' అనే వెబ్‌ సిరీస్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆమె యాక్ట్‌ చేసిన హాలీవుడ్‌ హారర్‌ మూవీ 'టారో' సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది.

చదవండి: ఏడాదికే భార్యకు విడాకులు.. హీరోయిన్‌తో నటుడి రెండో పెళ్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement