ఇంత అభిమానం ఊహించలేదు: అతుల్యా రవి   | Athulya Ravi Talk About Meter Movie | Sakshi
Sakshi News home page

Meter: ఇంత అభిమానం ఊహించలేదు

Mar 29 2023 10:19 AM | Updated on Mar 29 2023 10:19 AM

Athulya Ravi Talk About Meter Movie - Sakshi

‘‘మీటర్‌’ పక్కా కమర్షియల్‌ మూవీ. పాటలు, డ్యాన్సులు, మాస్‌ ఫైట్స్, రొమాన్స్, లవ్‌.. ఇలా అన్ని అంశాలుంటాయి. తండ్రి సెంటిమెంట్‌ కీలకంగా ఉంటుంది’’ అని హీరోయిన్‌ అతుల్యా రవి అన్నారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా రమేష్‌ కడూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీటర్‌’. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 7న విడుదల కానుంది.

ఈ సందర్భంగా అతుల్యా రవి మాట్లాడుతూ– ‘‘తమిళంలో చాలా సినిమాల్లో నటించాను. తెలుగు పరిశ్రమలోకి రావాలని కోరుకున్నాను. దేవుడి దయ వల్ల మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లాంటి ప్రముఖ సంస్థలు నిర్మించిన ‘మీటర్‌’లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో అబ్బాయిలంటే ఇష్టం లేని పాత్రలో కనిపిస్తాను. అయితే నా పాత్ర ఫస్ట్‌ హాఫ్‌లో కామెడీగా ఉంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి హ్యాపీగా ఉంది.. ఇంత అభిమానం ఊహించలేదు. ప్రస్తుతం తమిళ్‌లో ‘డీజిల్‌’ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement