స్టెప్పులు అదుర్స్‌ | Ashika Ranganath to Join Ravi Teja Film | Sakshi
Sakshi News home page

స్టెప్పులు అదుర్స్‌

Nov 4 2025 2:53 AM | Updated on Nov 4 2025 2:53 AM

Ashika Ranganath to Join Ravi Teja Film

ఫుల్‌ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు రవితేజ. ఆయన హీరోగా కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్ . ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది.

ప్రత్యేకంగా వేసిన సెట్‌లో శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో రవితేజ– ఆషికలపై అదిరిపోయే పాటని చిత్రీకరిస్తున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ‘‘ఈ సినిమాలో రవితేజ న్యూ స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తారు. హ్యూమర్, ఎమోషన్ , రవితేజ మార్క్‌ ఎనర్జీతో పాటుగా, మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. రవితేజ కెరీర్‌లోని ఈ 76వ సినిమాకు ‘అనార్కలి, రోల్‌ మోడల్, భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement