కూతురి డ్రీమ్‌ కోసం అర్జున్‌ కీలక నిర్ణయం | Arjun Sarja One Movie Plan With His Daughter, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

కూతురి డ్రీమ్‌ కోసం అర్జున్‌ కీలక నిర్ణయం

Oct 24 2024 6:56 AM | Updated on Oct 24 2024 9:04 AM

 Arjun Sarja One Movie Plan With His Daughter

ఫామ్‌కు, ఫేమ్‌కు నిలయం సినిమా. అందుకే ఈ రంగుల ప్రపంచంలో రాణించాలని చాలా మంది ఆశ పడుతుంటారు. ఇందులో లోతు తెలిసేది దిగిన తరువాతనే. కొందరు సక్సెస్‌ అవుతారు. మరికొందరు అందుకోసం మొక్కవోని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో నటి ఐశ్వర్య అర్జున్‌ ఒకరని చెప్పవచ్చు. ఈమె యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ వారసురాలు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన పెద్ద కూతురు అయిన ఐశ్వర్య అర్జున్‌కు కథానాయకిగా రాణించాలన్న ఆశ చాలానే ఉంది. అలా గత 10 ఏళ్ల క్రితమే నటుడు విశాల్‌కు జంటగా 'పట్టత్తుయానై' చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. 

అయితే, ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అందువల్ల మరో అవకాశం రాలేదు. దీంతో నటుడు అర్జున్‌ తన కూతురి డ్రీమ్‌ను నిజం చేయడానికి తనే మెగాఫోన్‌ పట్టి 'సొల్లిడవా' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆయన ప్రయత్నం సఫలం కాలేదు. ఆ తరువాత తెలుగులో కూతురిని కథానాయకిగా పరిచయం చేయాలని ప్రయత్నించారు. అందులో టాలీవుడ్‌ నటుడు 'విశ్వక్‌ సేన్‌'ను హీరోగా ఎంపిక చేశారు. అయితే ఆయనతో విబేధాల కారణంగా ఆ చిత్రం సెట్‌ పైకి వెళ్లలేదు. 

కాగా ఇటీవల ఐశ్వర్య అర్జున్‌ నటుడు ఉమాపతి తంబిరామయ్యను ప్రేమించడంతో ఆయనతోనే ఇటీవల పెళ్లి చేశారు. అయినప్పటికీ తన కూతుర్ని హీరోయిన్‌గా సక్సెస్‌ చేయడానికి తాజాగా మరోసారి ప్రయత్నం చేస్తున్నారు అర్జున్‌. ఈయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ఐశ్వర్య అర్జున్‌ను హీరోయిన్‌గా 'సీత పయనం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ నటుడు ఉపేంద్ర బంధువు నిరంజన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రం అయినా నటి ఐశ్వర్య అర్జున్‌కు మంచి రీ ఎంట్రీ అవుతుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement