ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన అరియానా.. పోస్ట్‌ వైరల్‌

Ariana Glory Says That She Is In Love But Gave A Twist At The End - Sakshi

Ariyana In Love: యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది అరియానా గ్లోరీ. ఆర్జీవీతో చేసిన ఒక్క ఇంటర్వ్యూతో ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయ్యింది ఈ బ్యూటీ.అదే స్టార్‌డమ్‌తో బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో కంటెస్టెంట్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. అయితే హౌజ్‌లో ఎంట్రీ ఇచ్చాక తన ముక్కుసూటితనంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ అమ్మడి యాటిట్యూడ్‌కి ఫిదా అయ్యి స్వయంగా సోషల్‌ మీడియాలో ఈమెకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అరియానా తాజాగా తాను ప్రేమలో ఉ‍న్నట్లు ప్రకటించింది.

గతంలో కంటే ఇంకా ఎక్కువగా తనను తాను ఇష్టపడుతున్నానని.. మీరు కూడా ఇంతేనా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్‌ చేసింది. ఇక సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా బాగానే ఉంది. ఇటీవలె ఆర్జీవీతో కలిసి జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అరియానా- అర్జీవీలకు సంబంధించిన జిమ్‌ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top