ప్రియురాలికి నటుడి ప్రపోజ్‌.. చప్పట్లు కొట్టిన తనయుడు | Arbaaz Khan Proposed To Shura Khan Few Days Before Wedding Infront Of His Son Arhaan Khan, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Arbaaz Khan: 56 ఏళ్ల వయసులో నటుడి పెళ్లి ప్రపోజల్‌.. కుమారుడి ముందే..

Jan 1 2024 11:19 AM | Updated on Jan 1 2024 11:41 AM

Arbaaz Khan Proposed to Shura Khan Few Days Before Wedding - Sakshi

'19వ తారీఖున ఎస్‌ చెప్పడం దగ్గరి నుంచి డిసెంబర్‌ 24న పెళ్లి చేసుకోవడం వరకు.. అంతా చాలా త్వరగా జరిగిపోయింది' అని రాసుకొచ్చింది షురా. వీరిద్దరికీ 'పాట్న శుక్ల'

ప్రేమ ఎప్పుడు? ఎక్కడ? ఎలా? మొదలవుతుందో ఎవరూ ఊహించలేరు. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌లాగా సులువుగా ప్రేమలో పడతారు.. నచ్చిన వెంటనే ప్రపోజ్‌ చేసుకుంటారు. ఉన్నన్నాళ్లూ కలిసుంటారు. తర్వాత బ్రేకప్‌ చెప్పుకుని మళ్లీ వేరేవాళ్లతో లవ్‌లో పడతారు. బాలీవుడ్‌లో అయితే ఇలాంటి సంఘటనలు కోకొల్లలు..

మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్‌..
బాలీవుడ్‌ భాయ్‌జాన్‌ సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు, నటుడు అర్బాజ్‌ ఖాన్‌ కూడా ఈ కోవలోకే వస్తాడు. 56 ఏళ్ల వయసున్న ఈ నటుడు ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్నాడు. కొడుకు అర్హాన్‌ ఖాన్‌ సమక్షంలో మేకప్‌ ఆర్టిస్ట్‌ షురా ఖాన్‌ను నిఖా చేసుకున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షురా ఖాన్‌ ఓ వీడియో షేర్‌ చేసింది. ఇందులో అర్బాజ్‌ మోకాళ్లపై కూర్చుని షురాకు పూల బొకేతో ప్రపోజ్‌ చేశాడు. బార్‌లో అందరి ముందు తనకు ప్రపోజ్‌ చేయడంతో ఆమె సిగ్గులమొగ్గైంది.

అంతా చాలా త్వరగా
ఇక తండ్రి ప్రపోజల్‌ను అక్కడే ఎదురుగా ఉండి చూస్తూ ఆనందించాడు అర్బాజ్‌ తనయుడు అర్హాన్‌. పుష్పగుచ్ఛాన్ని స్వీకరించిన తర్వాత షురాకు ఉంగరం తొడిగి ఆమె నుదుటన ముద్దు పెట్టాడు అర్బాజ్‌. తండ్రికి భాగస్వామి దొరికినందుకు సంతోషంతో చప్పట్లు కొట్టాడు అర్హాన్‌. '19వ తారీఖున ఎస్‌ చెప్పడం దగ్గరి నుంచి డిసెంబర్‌ 24న పెళ్లి చేసుకోవడం వరకు.. అంతా చాలా త్వరగా జరిగిపోయింది' అని రాసుకొచ్చింది షురా. వీరిద్దరికీ 'పాట్న శుక్ల' సినిమా సెట్స్‌లో పరిచయం ఏర్పడగా తర్వాత అది ప్రేమకు దారి తీసినట్లు కనిపిస్తోంది.

అర్బాజ్‌కిది రెండో పెళ్లి
కాగా అర్బాజ్‌.. గతంలో ఐటం సాంగ్‌ డ్యాన్సర్‌ మలైకా అరారోను పెళ్లి చేసుకున్నాడు. వీరికి అర్హాన్‌ ఖాన్‌ అనే కుమారుడు సంతానం. తర్వాత ఓ నటిని ప్రేమించగా ఇది పెళ్లి వరకు రాకుండానే బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఈ మధ్యే షురా ఖాన్‌ను ప్రేమించి షాదీ చేసుకున్నాడు.

చదవండి: ఓటీటీల్లో ఈ వారం 25 సినిమాలు రిలీజ్.. అవి మాత్రం ప్రత్యేకం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement