Ar Rahman: ఏఆర్‌ రెహమాన్‌ సంగీత బాణీలకు సలామ్‌ చేసిన ఐశ్వర్య

Ar Rahman Jamming Session With Director Aishwaryaa Rajinikanth - Sakshi

తమిళసినిమా: ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇటీవల విడుదల అయిన పొన్నియిన్‌ సెల్వన్‌ త్రంతో తనకు తానే సాటి అని మరోసారి నిరపించుకున్నారు. చేతిలో పలు చిత్రాలతో బిజీగా ఉన్న రెహమాన్‌  ప్రస్తుతం లాల్‌ సలాం సినిమాకి సంగీతం అందించడంలో నిమగ్నమయ్యారు. సపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అతిథి పాత్రలో నటించనున్న చిత్రం ఇది. ఆయన పెద్ద కతురు ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈమె 2012లో ధనుష్‌, శృతిహాసన్‌ జంటగా నటింన 3 త్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆ తరువాత గౌతమ్‌ కార్తీక్‌ హీరోగా వై రాజా వై చిత్రం చేశారు. మళ్లీ తాజాగా లాల్‌ సలాం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా నటించనున్నారు. ఈ చిత్రం ఈనెల 5వ తేదీన పూజా కార్యక్రవలతో ప్రారంభమైంది.

ప్రస్తుతం పాటల రికార్డింగ్‌ జరుగుతోంది. ఏఆర్‌.రెహమాన్‌  సంగీత బాణీలకు దర్శకురాలు ఐశ్వర్య మైమర పోతూ సలామ్‌ చేశారు. ఆ వీడియోను ఏఆర్‌ రెహవన్‌ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అది ఇప్పుడు వైరల్‌ అవుతోంది. కాగా లాల్‌ సలాం చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. లైకా ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top