
కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ప్రేమలో పడిందంటూ నెట్టింట వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv vikram)తో లవ్‌లో పడిపోయిందని పలు ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో వారు ముద్దు పెట్టుకున్నట్లు కనిపించడంతో అందరూ నిజమేనని నమ్ముతున్నారు. కొంత కాలంగా డేటింగ్‌లో ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వార్తలు కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, అదంతా తప్పుడు ప్రచారం అంటూ మరికొందరు చెబుతున్నారు. అనుపమ, ధ్రువ్ కలిసి ‘బైసన్’ కలిసి మారిసెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న బైసన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమాలో వారు ప్రేమికులుగా కనిపిస్తారట. ఈ పోటోలు కూడా ఈ చిత్రానికి సంబంధించినవే అంటూ కొందరు చెబుతున్నారు. అయితే, ఈ విషయం గురించి వారిద్దరి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈ కేరళ కుట్టి ప్రేమమ్ అనే మలయాళ చిత్రం ద్వారా ముగ్గురు కథానాయికల్లో ఒకరుగా పరిచయం అయ్యారు. కార్తికేయ 2 వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత ఆమెకు మరిన్ని అవకాశాలు పెరిగాయి. దీంతో తమిళం, కన్నడం భాషలో నటిస్తున్నారు. ఇప్పటికీ చేతిలో నాలుగైదు చిత్రాలతో బిజీగానే ఉన్నారు. రీసెంట్‌గా నటుడు ప్రదీప్ రంగనాథన్ మూవీ డ్రాగన్‌లో అనుపమ నటించారు. టిల్లు స్క్వేర్ చిత్రంలో అందాల ఆరబోతలో శృతిమించారని విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని ఆమె పెద్దగా పట్టించుకోలేదు.