20 ఏళ్ల తర్వాత మెగాఫోన్‌ పట్టనున్న అనుపమ్‌ ఖేర్‌ | Anupam Kher 20 Years After Enter In Direction | Sakshi
Sakshi News home page

20 ఏళ్ల తర్వాత మెగాఫోన్‌ పట్టనున్న అనుపమ్‌ ఖేర్‌

Aug 23 2024 12:22 PM | Updated on Aug 23 2024 3:56 PM

Anupam Kher 20 Years After Enter In Direction

ఐదు వందలకు పైగా సినిమాల్లో నటించిన బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఓం జై జగదీష్‌’ (2002). ఆ సినిమా తర్వాత ఆయన డైరెక్షన్‌ విభాగంలో అడుగుపెట్టలేదు. అయితే, సుమారు ఇరవయ్యేళ్ల తర్వాత అనుపమ్‌ ఖేర్‌ దర్శకుడిగా మళ్లీ మెగాఫోన్‌ పట్టి, హిందీలో ‘తన్వి: ది గ్రేట్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది.

కాగా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’తో పాటు పలు హాలీవుడ్‌ చిత్రాలు, సిరీస్‌లలో నటించిన ఇయాన్‌ గ్లెన్‌ ‘తన్వి’ సినిమాలో ఓ కీలక ΄పాత్రలో నటిస్తున్నారు. ‘తన్వి’ సెట్స్‌లో ఇయాన్‌ ΄పాల్గొన్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఈ విషయంపై  అనుపమ్‌ ఖేర్‌ ఓ క్లారిటీ ఇచ్చారు. ‘‘హిస్టారికల్‌ డ్రామా ‘మిసెస్‌ విల్సన్‌’ సిరీస్‌లో నేను, ఇయాన్‌ కలిసి నటించాం. ఇప్పుడు నా దర్శకత్వంలోని ‘తన్వి’ సినిమాలో ఇయాన్‌ నటిస్తున్నారని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. 

ఇండియన్‌ సినిమాలో నటిస్తున్న ఇయాన్‌కు స్వాగతం’’ అని తెలి అనుపమ్‌ ఖేర్‌ తెలిపారు. ఇండియన్‌ సినిమాలో నటించడం తనకు చాలా ఆనందంగా ఉందని ఇయాన్‌  అన్నారు. ఇక్కడి సినిమాలో  నటించే అవకాశం దక్కడం చాలా గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.  ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement