నాన్న ముందే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను: హీరోయిన్‌ | Sakshi
Sakshi News home page

నాన్న ముందే లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను: హీరోయిన్‌

Published Mon, Mar 4 2024 12:39 PM

Andrea Jeremiah Viral Comments On Her Life - Sakshi

సంచలన నటీమణుల్లో ఆండ్రియా ఒకరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. రీసెంట్‌గా సైంధవ్‌ చిత్రంలో కనిపించిన ఈ బ్యూటీ తన నటనతో మెప్పించింది. ఆమె జీవితంలో రాసలీలలు, ప్రేమలో పడడం, మోసపోవడం వంటి సంఘటనలు  మీడియాలో కథలు కథలుగా వెలువడిన విషయం తెలిసిందే. తన గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ ఎప్పుడూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఆమె నటి మాత్రమే కాదు మంచి  గాయని కూడా..

సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. 2005లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ 'యుగానికి ఒక్కడు' సినిమాతో బాగా పాపులర్‌ అయింది ఆండ్రియా. ఆ తర్వాత తడాఖా, విజయ్‌తో మాస్టర్, కలహాసన్‌తో విశ్వరూపం, వెట్రిమారన్ దర్శకత్వం వహించిన వడచెన్నై వంటి చిత్రాల్లో ఆమె మెప్పించింది. నటిగానే కాకుండా గాయనిగా కూడా మెరిసిన ఆండ్రియా... వివాదాలకు కొదవలేదు. ఆమె అనిరుధ్‌తో ప్రేమ వ్యవహారం, సీనియర్ నటుడితో సన్నిహిత సంబంధం వంటి అనేక వివాదాల్లో చిక్కుకుంది. తాజగా ఒక ఇంటర్వ్యూలో చిన్న వయసులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు ఆమె చెప్పుకొచ్చింది.

'అప్పట్లో నా వయస్సు 11 సంవత్సరాలు. నేను మా తల్లిదండ్రులతో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాను. ఆ సమయంలో నేను జీన్స్, టీ-షర్ట్ మాత్రమే ధరించాను. మా నాన్న కూర్చున్న సీటుకు కొంచెం దగ్గర్లోనే నేనూ కూర్చున్నాను. అప్పుడు ఎవరో లోపల చేయి వేసినట్లు అనిపించింది. నా  షర్ట్‌లో ఎవరో చేయి పెట్టారన్న ఊహనే తట్టుకోలేకపోయాను. ఇక వెంటనే భయపడిపోయాను. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా భయంతో వచ్చి మా నాన్న పక్కన కూర్చున్నాను.ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడానికి కారణం ఏమిటో అర్ధంకాక అప్పుడే ఏడుపు మొదలెట్టాను.' అని ఆండ్రియా చెప్పుకొచ్చంది. తన జీవితంలో జరిగిన ఈ చేదు అనుభవాన్ని ఆండ్రియా పంచుకున్న తర్వాత, అభిమానులు ఆమెను ఓదార్చారు. ఆండ్రియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement