
సింగర్, హీరోయిన్ ఆండ్రియా జెర్మియా (Andrea Jeremiah) తన పెంపుడు శునకం బర్త్‌డేను సెలబ్రేట్ చేసింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న జాన్ స్నో నేడు (జూలై 6న) ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. దీంతో స్నో పుట్టినరోజును పెట్ క్లబ్‌లో జరిపింది. కుక్కను ముద్దుగా ముస్తాబు చేసి దానికి బదులుగా తనే కేక్ కట్ చేసింది. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ బర్త్‌డే వేడుకలకు వచ్చిన అతిథులు కూడా శునకాలే కావడం విశేషం.
సినిమా
తడాఖా, చంద్రకళ (అరణ్మనై), అంతఃపురం (అరణ్మనై 3), డిటెక్టివ్, మాస్టర్, సైంధవ్, వడ చెన్నై, తుపాకి, యుగానికి ఒక్కడు వంటి పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పిశాచి 2, నో ఎంట్రీ, మాస్క్, మానుషి సినిమాలు చేస్తోంది. తాప్సీ, అమీ జాక్సన్, రెజీనా కసాండ్రా వంటి పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పింది. గిలిగిలిగా (దేశముదురు), జరజర.. (రాఖీ), దీవాళీ దీపానీ (దడ), ఓయ్ ఓయ్ ఓయ్ (ఎవడు) వంటి పలు సాంగ్స్ ఆలపించింది.
చదవండి: బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్.. 40 ఏళ్ల హీరోతో..