ప్రతిభ ఉంటే చాలు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇందుకు ఫర్‌ఫెర్ట్ ఎగ్జాంపుల్ అనస్పర రాజన్. అతి తక్కువ కాలంలోనే మలయాళం, తెలుగు, తమిళం, హిందీ అంటూ పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2017లో మాతృభాష మలయాళంలో ఉదహరణం సుజాత అనే చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ 9 ఏళ్లలోనే 30కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇటీవల తమిళంలో హీరోయిన్‌గా నటించిన విత్‌లవ్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అందులో కళాశాల విద్యార్థినిగా తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో ఇట్లు అర్జున, తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కుతున్న 7 జీ రెయిన్‌బో కాలని చిత్రాలతో పాటు మలయాళంలో ఓ మూవీతో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రత్యేక ఫొటో షూట్ నిర్వహించి ఆ ఫొటోలను సామాజిక మాద్యమాల్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా అనస్పర రాజన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఛాలెంజింగ్ కథా పాత్రల్లో నటించడం అంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఒకే తరహా పాత్రల్లో నటించడం తనకు ఇష్టం ఉండదన్నారు. ఎలా ఇలాంటి పాత్రల్లో నటించారు అని చర్చించుకునే విధంగా బలమైన పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నానన్నారు. తనకు ఛాలెంజ్‌లను ఎదుర్కొవడం ఇష్టం అన్నారు. అలాంటి వైవిద్యభరిత కథా పాత్రల కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఈ అమ్మడు ఇప్పటి వరకూ నటనకు అవకాశం ఉన్న పాత్రలనే ఎక్కువగా చేశారు. ఈ 23 ఏళ్ల బ్యూటీ ముందు ముందు ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాల్సిందే.


