
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన అభిమానులకు గిప్ట్‌లు అందించారు. తన నివాసం వద్దకు వచ్చిన ఫ్యాన్స్‌కు హెల్మెట్స్ అందజేశారు. అంతేకాకుండా దాండియా ఆట ఆడే కర్రలు కూడా ఇచ్చారు. కౌన్ బనేగా కరోడ్‌పతి కంటెస్టెంట్ రాఘవేంద్ర కుమార్ నుంచి తాను ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. ప్రతి ఆదివారం తన అభిమానులను కలుస్తోన్న అమితాబ్ వారికి చిరు కానుకలు అందజేస్తున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. జీవితంలో ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
అమితాబ్ తన ట్వీట్‌లో రాస్తూ.. కేబీసీలో హెల్మెట్ మ్యాన్‌ని కలవడం నాకు చాలా గౌరవంగా ఉంది.. ఆయన బైక్ రైడర్లకు భద్రత కోసం స్వచ్ఛందంగా హెల్మెట్లు ఇస్తారు. అతన్ని చూసి నేను కూడా ప్రేరణ పొందాను. అందుకే ప్రతి ఆదివారం అభిమానుల సమావేశంలో దాండియా కర్రలతో పాటు.. వీలైనన్ని ఎక్కువ మందికి హెల్మెట్లు ఇచ్చాను' అని పోస్ట్ చేశారు.
కాగా.. కౌన్ బనేగా కరోడ్‌పతి షో పాల్గొన్న రాఘవేంద్ర కుమార్ రోడ్డు భద్రతను ప్రోత్సహించే విషయంలో భారతదేశం అంతటా గుర్తింపు పొందారు. అతను ఇప్పటికే వేలాదిమందికి హెల్మెట్లను అందించారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలపై ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఈ పోస్ట్ చూసిన కుమార్.. అమితాబ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రశంసలు తన జీవితంలో దక్కిన గొప్ప అవార్డు సంతోషం వ్యక్తం చేశారు. తన కలకు మీరు తోడుగా నిలవడం నాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.
కాగా.. బిగ్ బి ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి -17 సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన చివరిసారిగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన కల్కి 2898 ADలో కనిపించారు. ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్రలో అభిమానులను మెప్పించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు.
T 5510 - Honoured to have met the "HELMET MAN" at KBC .. who voluntarily gives out helmets to bike riders for safety ..
A learning for me .. so I followed and gave out at the Sunday Fan meet .. dandiya sticks for dandiya and helmets to as many as I could ..
Each day is a… pic.twitter.com/jfdwe1Zi9j— Amitabh Bachchan (@SrBachchan) September 21, 2025