అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండులో గట్టిగానే కొట్టిన మల్లిగాడు | Actor Suhas Ambajipeta Marriage Band Movie Teaser Released, Check Teaser Highlights Inside - Sakshi
Sakshi News home page

Ambajipeta Marriage Band Teaser: అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండులో గట్టిగానే కొట్టిన మల్లిగాడు

Oct 9 2023 7:20 PM | Updated on Oct 9 2023 7:27 PM

Ambajipeta Marriage Band Teaser Released - Sakshi

కేరాఫ్‌ కంచర పాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’. ఈ సినిమాకు దుశ్యంత్‌ కటికనేని దర్శకత్వం వహిస్తున్నారు.జీఏ2 పిక్చర్స్‌, స్వేచ్ఛ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ తాజాగా విడుదలైంది.

(ఇదీ చదవండి: సూర్యచంద్రులకు కూడా నిన్ను చూపించేదాన్ని కాదు: విజయ్‌ ఆంటోనీ భార్య)

ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కలర్ ఫోటో’ జాతీయ స్థాయిలో అవార్డు దక్కడంతో సుహాస్‌కు మంచి గుర్తింపు దక్కినా  రైటర్ పద్మభూషణ్‌తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు మరింత చేరువయ్యాడు. తాజాగా ఆయన నుంచి వస్తున్న అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు టీజర్‌ అందరినీ మెప్పించేలా ఉంది. మల్లిగాడు (సుహాస్‌) ఒక సెలూన్  నడుపుతూనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్‌లో డప్పు కొడుతుంటాడు.

అలాంటి వాడికి ఒక కాలేజీ అమ్మాయి పరిచయం కావడం.. వారిద్దరూ ప్రేమలో పడటం వల్ల ఎదరయ్యే సమస్యలు కథలు ప్రధానంగా ఉన్నట్లు టీజర్‌లో తెలుస్తోంది. టీజర్‌ చివరిలో సుహాస్‌కు గుండు కొట్టిస్తూ ఉన్న షాట్ హైలైట్‌గా ఉన్నా.. అందుకు ప్రధాన కారణాలు ఎంటి..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది. టీజర్‌ చూస్తుంటే మల్లిగాడు బ్యాండ్‌ గట్టిగానే కొట్టినట్లు ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement