అమర్‌ దీప్‌కు షాకిచ్చిన బిగ్‌ బాస్‌.. తెలియకుండానే ఏడ్చాను అంటూ.. | Sakshi
Sakshi News home page

Bigg Boss 7: అమర్‌ దీప్‌కు షాకిచ్చిన బిగ్‌ బాస్‌.. తెలియకుండానే ఏడ్చాను అంటూ..

Published Thu, Nov 9 2023 11:20 AM

Amardeep Wife Tejaswini Enter In Bigg Boss 7 Telugu House - Sakshi

బిగ్‌ బాస్ ఏ సీజన్‌లో అయినా సరే కంటెస్టెంట్ల మధ్య గొడవలు సహజం.. వారి మధ్య కోపాలు, పంతాలు ఎన్ని ఉన్నా సరే ఫ్యామిలీ వారం అనేది ఒక దశలో వస్తుంది.. ఆ సమయంలో వారందరూ ఎంతో సంతోషంగా కలిసిపోతారు. ఆ సమయం నుంచి వారి ఆటలో మార్పులు కూడా రావచ్చు..  ప్రస్తుతం బిగ్‌బాస్ -7 సీజన్‌లో కూడా కంటెస్టెంట్‌లలో ఎమోషన్ నింపి  ప్రేక్షకులతో కట్టిపడేసే సీన్లు ఎన్నో కనిపిస్తున్నాయి. తాజాగా బిగ్‌ బాస్‌లోకి అమర్‌ దీప్‌ సతీమణి తేజశ్విని వచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది.

(ఇదీ చదవండి: మహ్మద్‌ షమీ బౌలింగ్‌కు క్లీన్‌ బౌల్డ్‌ అయిన హీరోయిన్‌)

ఈ సీజన్‌లో ఇప్పటికే శివాజీ, అర్జున్‌, గౌతమ్‌, అశ్విని, భోలే, ప్రియాంక కుటుంబ సభ్యులు హౌస్‌కు వచ్చి వారందరితో కొంత సమయం గడిపారు. ఫ్యామిలీ మెంబర్స్‌ రాకతో కంటెస్టెంట్స్‌లలో సంతోషం రెట్టింపు అయింది.  నవంబర్‌ 8న అమర్‌ దీప్‌ పుట్టినరోజు కావడంతో ఆయనకు బిగ్‌ బాస్‌ షాకిచ్చాడు. మొదట అమర్‌ను ప్రత్యేక గదికి పిలిపించిన బిగ్‌ బాస్‌ అక్కడ ఒక కేకును ఉంచుతాడు. ఈ కేకును మీ సతీమణి తేజశ్విని పంపించారని ఆమె రాలేదని చెప్పి కొంత ఫన్‌ క్రియేట్‌ చేస్తాడు బిగ్‌ బాస్‌. అప్పుడు కొంతమేరకు నిరుత్సాహపడిన అమర్‌ కేకును తీసుకుని బయటకు వచ్చేస్తాడు.

ఆ సమయంలో అక్కడ తేజశ్విని వచ్చి ఉంటుంది. ఒక్కసారిగా ఆయన ముందుకు వచ్చి ఆమె షాకిస్తుంది. దీంతో తేజశ్వినిని కౌగిలించుకున్న అమర్‌ ఎమోషనల్‌ అయ్యాడు. బిగ్‌ బాస్‌ ఎంట్రీకి కొన్ని రోజులకు ముందే వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  కానీ ప్రోమోలో మళ్లీ పెళ్లి చేసుకుందామా..? అని ఫన్నీగా అంటాడు. తేజూని చూసిన అమర్‌ బాగా ఎమోషనల్‌ అయి ఇలా అంటాడు 'కొన్ని సార్లు పడుకొని ఏడుస్తున్నాను. ఒకవేళ ఏడుస్తే కనపడుతుంది కదా అని తెలియకుండానే ఏడ్చాను.' అనే మాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ రోజు రాత్రి టెలికాస్ట్‌ అయ్యే ఎపిసోడ్‌లో అమర్‌ కుటుంబ సభ్యులతో పాటు మరికొందరి ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా రావచ్చు.

Advertisement
 
Advertisement
 
Advertisement