మహ్మద్‌ షమీ బౌలింగ్‌కు క్లీన్‌ బౌల్డ్‌ అయిన హీరోయిన్‌ | Bollywood Actress Payal Ghosh Wants To Marry Team India Pacer Mohammed Shami On One Condition, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

Payal Ghosh And Mohammed Shami: మహ్మద్‌ షమీకి ఆఫర్‌ ఇచ్చిన హీరోయిన్‌.. కానీ ఒక కండీషన్‌ అంటూ

Published Thu, Nov 9 2023 9:12 AM

Actress Payal Ghosh Wants To Marry Mohammed Shami - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ దుమ్ములేపుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన షమీ.. 16 వికెట్లు పడగొట్టి సీరిస్‌లో టాప్‌ ఫైవ్‌ బౌలర్ల లిస్ట్‌లో చేరాడు. అలా భారత్‌ విజయాల్లో షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఇండియా మొత్తం షమీ పేరు మారుమ్రోగుతుంది.

తాజాగా సోషల్ మీడియాలో షమీ పెళ్లి గురించి పెద్ద చర్చే జరుగుతుంది. షమీని పెళ్లి చేసుకుంటానని ఒక నటి నేరుగా కోరింది. ఆమె ఎవరో కాదు పాయల్ ఘోష్. 'ఊసరవెల్లి' సినిమాలో తమన్నా ఫ్రెండ్‌ చిత్రగా నటించింది ఈ బ్యూటీ. తన సోషల్‌ మీడియా ఖాతా నుంచి షమీకి ఆమె ప్రపోజ్ చేసింది. కానీ షమీని పెళ్లి చేసుకోవడానికి ప్రత్యేక షరతు ఇలా పెట్టింది. 'షమీ.. నువ్వు ఇంగ్లిష్‌ని మెరుగుపరుచుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.' అంటూ ఒక కండీషన్‌ పెట్టి ట్వీట్ చేసింది. ఆ తర్వాత ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది మాత్రమే కాదు, పాయల్ మళ్లీ ట్వీట్ చేసింది. అందులో 'మహ్మద్ షమీ.. సెమీ-ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నా నుంచి మీకు ఏ సహాయం కావాలి చెప్పాలని కోరింది. ముందుగా ఫైనల్స్‌లో భారత్‌ స్థానం సంపాదించాలి. అక్కడ నువ్వు హీరో అవ్వాలని నేను కోరుకుంటున్నాను.' అని పాయల్‌ చేసిన వ్యాఖ్యలపై  నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే షమీకి ఫ్యాన్ అయిపోయిందా.. లేక పబ్లిసిటీ కోసమే ఇలా ట్వీట్ చేసిందా..? అని వారు ప్రశ్నిస్తున్నారు.

హసీన్ జహాన్‌తో షమీ పెళ్లి.. ఆపై విడాకులు
హసీన్ జహాన్‌ను 2014లో మహ్మద్ షమీ పెళ్లి చేసుకున్నాడు. 2015లో వారికి ఓ కూతురు జన్మించింది. 2018లో షమీ వేధిస్తున్నాడంటూ.. హసీన్ అతనిపై వేధింపుల కేసు పెట్టింది. అప్పటి నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ కేసు విషయంలో ఇటీవలే తీర్పునిచ్చిన కోల్‌కతా కోర్టు.. ప్రతినెలా హసీన్‌కు లక్షా 30 వేల రూపాయలు భరణంగా చెల్లించాలని షమీని ఆదేశిస్తూ తీర్పు నిచ్చింది.

Advertisement
 
Advertisement
 
Advertisement