Allu Sneha: కిచెన్‌లో తల్లితో కలిసి వంట చేస్తున్న అల్లు అయాన్‌

Allu Ayaan Cooks With Mother Allu Sneha - Sakshi

టాలీవుడ్‌లో స్టైలిష్‌ హీరో ఎవరంటే అల్లు అర్జున్‌ అని టక్కున చెప్పేస్తారు. బన్నీయే కాదు ఆయన సతీమణి స్నేహ కూడా స్టైలిష్‌ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుంటుంది. ఇటీవల ఫ్యాన్స్‌తో జరిపిన చిట్‌చాట్‌లో కొత్త సంవత్సరం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్న ప్రశ్నకు తన తనయుడు అయాన్‌తో కలిసి వంట చేయాలనుకుంటున్నానని ఆన్సరిచ్చింది.

ఆ మాట చెప్పిందో లేదో వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేసింది స్నేహ. తాజాగా అయాన్‌తో కలిసి వంట చేస్తున్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇందులో అయాన్‌ తల్లికి సాయంగా కిచెన్‌లో కూరగాయలు కట్‌ చేస్తున్నాడు. ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అయాన్‌ తల్లికి ఇలాగే హెల్ప్‌ చేస్తే త్వరలోనే మంచి చెఫ్‌ అవుతాడని సరదాగా కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్‌. ఇకపోతే అల్లు అర్జున్‌- స్నేహ.. గురువారం నాడు దిల్‌ రాజు మనవరాలి పుట్టిన రోజు ఫంక్షన్‌లో తళుక్కుమని మెరిసిన సంగతి తెలిసిందే!

చదవండి: దిల్‌రాజు మనవరాలి బర్త్‌డే ఫంక్షన్‌లో బన్నీ దంపతులు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top