Pushpa Movie: Allu Arjun Visits RTC X Road Sandhya Theater With Family To Watch His Movie - Sakshi
Sakshi News home page

Allu Arjun: ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు సంధ్య థియేటర్లో అల్లు అర్జున్‌ ఫ్యామిలీ సందడి

Dec 17 2021 3:51 PM | Updated on Dec 20 2021 11:31 AM

Allu Arjun Visits RTC X Road Sandhya Theater With Family To Watch Pushpa - Sakshi

Allu Arjun And Family Visits RTC X Road Sandhya Theater: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తాజా చిత్రం పుష్ప మూవీ నేడు(డిసెంబర్‌ 17) విడుదలైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప రిలీజ్‌ అయిన థియేటర్లో బన్నీ ఫ్యాన్స్‌ తగ్గేదే లే అన్నట్టుగా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఓ థియేటర్లో బన్నీ ఫ్యామిలీతో కలిసి సందడి చేశాడు. పుష్ప మూవీ చూసేందుకు భార్య స్నేహారెడ్డి, కుమారుడు అయాన్‌తో కలిసి ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ సంధ్య థియేటర్‌కు వచ్చారు అల్లు అర్జున్‌. అక్కడ బన్నీని చూడగానే ఫ్యాన్స్‌ అంతా మరింత రచ్చ చేశారు.

చదవండి: ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌, ప్రస్తుతం నో ఆఫర్స్‌, అయినా తగ్గని క్రేజ్‌..

బన్నీతో సెల్ఫీ దిగేందుకు అభిమానులంతా ఎగబడ్డారు. అల్లు అర్జున్‌పై పూలు చల్లుతూ ‘తగ్గేదే లే’ అంటూ అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. ఈ క్రమంలో థియేటర్లోకి వెళ్లేందుకు బన్నీ ఫ్యామిలీ కాస్తా ఇబ్బంది పడింది. ఇక వారి రాకతో అక్కడ మరింత సందడి వాతావరణం నెలకొంది. అయితే ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ అంటే థియేటర్లకు అడ్డా.. ఏ సినిమాను చూడాలన్నా… గొంతుచించుకుని అరవాలన్నా… హంగామా చేయాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆర్టీసీ క్రాస్‌ రోడ్డుయే. అందుకే అక్కడి థియేటర్లలో ఏ సినిమా రిలీజైనా… ఆ సినిమా హీరో వచ్చి ఫ్యాన్స్ రెస్పాన్స్‌ను చూస్తుంటారు. సినిమా ఎలా ఉందో తెలుసుకుంటారు. 

చదవండి: ‘పుష్ప’మూవీ రివ్యూ

Advertisement
 
Advertisement
Advertisement