
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి కాస్త బ్రేక్ రావడంతో ఫ్యామిలీలో కలిసి మాల్దీవుల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో భార్య స్నేహా రెడ్డి, కూతురు ఆర్హతో కలిసి హైదరాబాద్ రోడ్లపై షికారు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
చదవండి: ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో ఆ ధైర్యం వచ్చింది: సమంత
బన్నీ కారు నడుపుతుంటే వెనక సీట్లో ఆర్హ మొబైల్‌లో గేమ్ ఆడుతూ కనిపించింది. బన్నీ పక్కనే కూర్చున్న స్నేహా వారిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేసింది. భార్య, కూతురుతో కలిసి కారులో అలా సరదాగా షికారుకు వెళ్లిన బన్నీ ‘గుచ్చే గులాబి లాగా’ పాటను పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. కాగా బన్నీ పుష్ప మూవీ రెండు భాగాలుగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ డిసెంబ్ 17న విడుదలకు సిద్దమవుతోంది.