
Allu Arjun Pushpa Tamil Distribution Rights: క్రియేటివ్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్ 1.. ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్.
చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా
పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ మూవీని తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు కన్నడలోనే విడుదల చేస్తున్నారు. ఇక పుష్పను హిందీలో గోల్డ్ మైన్స్ కంపెనీ విడుదల చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వినిపించగా... తమిళంలో లైకా ప్రోడక్షన్స్ భారీగా విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. మరో విషయమేంటంటే దర్శక ధీరుడు తాజా తెరక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ను కూడా తమిళంలో విడుదల చేయనున్నారు. దీనిని విడుదల చేసేందుకు లైకా ప్రొడక్షన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ పుష్ప కంటే ముందే జరిగింది.
చదవండి: కృతిశెట్టి లుక్ షేర్ చేసిన చై, కొడుకును ఇలా ప్రశ్నించిన నాగ్
దీంతో రెండు భారీ బడ్జెట్ చిత్రాలను లైకా ప్రొడక్షన్ తమిళంలో విడుదల చేసి క్యాష్ చేసుకునే పనిలో పడింది. ఇదిలా ఉంటే పుష్ప మూవీలో యలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గ నటిస్తుండగా ప్రముఖ యాంకర్ అనయసూయ . దాక్షాయనిగా అలరించినుంది. ఇక నటుడు సునీల్‌ను మంగలం శ్రీనుగా ఇటీవల మేకర్స్ పరిచయం చేశారు. మరోవైపు ఈ సినిమాలో ఓ భారీ మాస్ సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఇందులో బన్నీ 1000 మంది డాన్సర్లతో కలిసి షూట్‌లో పాల్గొననున్నాడని సమాచారం.
చదవండి: 46 ఏళ్లకు తల్లైన స్టార్ హీరోయిన్, కవలలకు జననం
#PushpaTheRise keeps getting huge with time 🤘
— Pushpa (@PushpaMovie) November 17, 2021
Grand release in Tamil Nadu by the prestigious @LycaProductions 💥💥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/eOmXYcwb4Y