Allu Arjun New Look Goes Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun: నోట్లో సిగరెట్‌, చెవికి పోగు.. అల్లు అర్జున్‌ న్యూ లుక్‌ వైరల్‌

Jul 30 2022 9:50 AM | Updated on Jul 30 2022 10:47 AM

Allu Arjun New Look Goes Viral - Sakshi

‘పుష్ప’ చిత్రంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడాయన పాన్‌ ఇండియా స్టార్స్‌ లిస్ట్‌లో చేరాడు. టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా.. బాలీవుడ్‌లోనూ బన్నీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. సినీ ప్రియులంతా పుష్ప 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింట్‌ మొదలు కానుంది. ఇలాంటి తరుణంలో బన్ని న్యూలుక్‌లో దర్శనమిచ్చి అందరికి షాకిచ్చాడు.

(చదవండి: సల్మాన్‌తో మెగాస్టార్‌ స్టెప్పులు.. కనువిందు ఖాయం)

కొద్దిగా నెరసిన గెడ్డం, నోట్లో సిగరేట్‌, చెవికి పోగు పెట్టి రఫ్‌లో లుక్‌లో కనిపించాడు బన్ని. అయితే ఈ నయా లుక్‌ సినిమా కోసం కాదు. ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం బన్ని ఇలా కనిపించాడు. ఇటీవలే త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ యాడ్‌ చిత్రీకరణలో పాల్గొన్న బన్ని..తాజాగా హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో మరో యాడ్‌ చేశాడు. దాని కోసమే బన్ని ఇలా నయా లుక్‌లో కనిపించాడు. ఈ ఫోటోని బన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా.. కొన్ని క్షణాల్లోనే అది నెట్టింట వైరల్‌ అయింది. బన్ని నయా లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. లైకులు, రీట్వీట్లతో సోషల్‌ మీడియాని హోరెత్తిస్తున్నారు.

సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న పుష్ప 2 షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. మారేడుమిల్లి అడవుల్లోనే ఎక్కువ భాగం షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేశాడు సుకుమార్. జనవరితో షూటింగ్ కంప్లీట్ చేసి, మరో నాలుగు నెలలు పోస్ట్ ప్రోడకన్ కు టైమ్ ఇచ్చి, వచ్చే వేసవి లో పుష్పరాజ్ గ్రాండ్ రీఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement