అర్హ స్టంట్‌కి షాక్‌ అయిన అ‍ల్లు అర్జున్‌.. ఫోటో వైరల్‌ | Allu Arjun Daughter Arha Yoga Photos Shocks Everyone | Sakshi
Sakshi News home page

Allu Arjun: అర్హ చేసిన పనికి షాక్‌ అయిన అ‍ల్లు అర్జున్‌.. ఫోటో వైరల్‌

Mar 21 2023 12:10 PM | Updated on Mar 21 2023 12:43 PM

Allu Arjun Daughter Arha Yoga Photos Shocks Everyone - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్‌లో తెలియని వారుండరు. సోషల్‌ మీడియాలోనూ అర్హకు బోలెడంత ఫాలోయింగ్‌ ఉంది. తన ముద్దు ముద్దు మాటలు, చేష్టలతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకునే అర్హ తాజాగా తన టాలెంట్‌తో మరోసారి సర్‌ప్రైజ్‌ చేసింది.

అతి చిన్న వయసులోనే క్లిష్టమైన యోగాసనాలు వేసి తండ్రి అల్లు అర్జున్‌కే ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన ఓ క్యూట్‌ ఫోటోను స్నేహారెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసుకోవడంతో ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

అయాన్‌, అర్హ చేసే అల్లరి ఫోటోలు, వీడియోలను స్నేహారెడ్డి తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటదన్న విషయం తెలిసిందే. తాజాగా తమ గార్డెన్‌లో అర్హ యోగాసనం వేస్తుంటే అది చూసి బన్నీ షాక్‌ అవుతున్నట్లు ఒక ఫోటోను స్నేహా అభిమానులతో పంచుకుంది. ఇక అర్హ ఇప్పటికే  శాకుంతలం సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement