Allu Arjun: Stylester Crosses 15 Million Followers In Instagram Pic Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun : అల్లు అర్జున్ ఖాతాలో అరుదైన రికార్డు

Jan 14 2022 3:07 PM | Updated on Jan 14 2022 3:36 PM

Allu Arjun Crosses 15 Million Followers In Instagram - Sakshi

సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం గమనార్హం.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడు. అందుకే ఆయనకు రోజు రోజుకి ఫాలోవర్స్‌ పెరిగిపోతున్నారు. తాజాగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా 15 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం గమనార్హం.

తనకు 15 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్‌లోనూ అల్లు అర్జున్‌కు 6 మిలియన్ ఫాలోయర్స్ పైగా ఉన్నారు. అలాగే ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ పైగా సంపాదించుకున్నారు. 

ఇక సినిమాల విషయానికొస్తే.. ఆయన నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుంది. గతేడాది డిసెంబర్ 17న రిలీజైన ఈ సినిమా ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది. 2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడం మాత్రమే కాదు బన్ని కెరీర్ లో తొలిసారి 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement