Allu Arjun And Sukumar Cried In Pushpa Movie Thanks Meet - Sakshi
Sakshi News home page

Pushpa: బన్నీ ఎమోషనల్‌ స్పీచ్‌.. కంటతడి పెట్టిన సుకుమార్‌.. వీడియో వైరల్‌

Dec 28 2021 3:53 PM | Updated on Dec 28 2021 4:28 PM

Allu Arjun And Sukumar Cried At Pushpa Movie Thanks Meet, Video Viral - Sakshi

పరుగు సినిమా సమయంలో నేను 85 లక్షలు పెట్టి ఓ కారు కొన్నాను. స్టీరింగ్‌పై చేయివేసి.. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరని ఆలోచించగా...నాకు ఫస్ట్‌ గుర్తొచ్చిన పేరు

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ ‘పుష్ప’బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తుంది. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్‌ ఇండియా మూవీ.. అదేస్థాయిలో వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం.. బన్నీ చర్రితల్లో రికార్డ్‌ని క్రియేట్‌ చేస్తుంది. ‘పుష్పరాజ్‌’పాత్రలో బన్నీ ఊర మాస్‌ యాక్టింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్‌  థ్యాంక్యూ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ మట్లాడుతూ ఎమోషనల్‌ అయ్యాడు.

‘నా జీవితంలో రుణపడి ఉన్నాను అనే పదాన్ని చాలా తక్కువ మందికే వాడతాను. రైతుగా ఉన్న మా తాత(అల్లు రామలింగయ్య)సినిమాల్లోకి రాకపోతే మేము ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవాళ్లం కాదు. కాబట్టి మా తాతగారికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సినిమాల్లో ఫస్ట్‌ నుంచి నన్ను ప్రోత్సహిస్తున్న చిరంజీవిగారికి రుణపడి ఉన్నాను అనే మాట వాడతాను. ఆ తర్వాత నేను సుకుమార్‌కే ఆ మాటను వాడతాను.  నాకు సుకుమార్‌ అంటే అంత ఇష్టం నాకే తెలియదు.. పరుగు సినిమా సమయంలో నేను 85 లక్షలు పెట్టి ఓ కారు కొన్నాను. స్టీరింగ్‌పై చేయివేసి.. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరని ఆలోచించగా...నాకు ఫస్ట్‌ గుర్తొచ్చిన పేరు సుకుమార్‌. డార్లింగ్‌.. నువ్వు లేక పోతే నేను లేను.. ఆర్య లేదు.. మరేమీ లేవు.  నా జీవితం ఇంత సక్సెస్ ఫుల్ గా సాగుతుందంటే అది కేవలం సుకుమార్ వల్లే’అంటూ బన్నీ కంటతడి పెట్డాడు. ఆ  సమయంలో అక్కడే ఉన్న సుకుమార్‌ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement