Ala Vaikunthapurramuloo: బాలీవుడ్‌లో అల వైకుంఠ‌పుర‌ములో.. జ‌న‌వ‌రిలోనే రిలీజ్‌!

Ala Vaikunthapurramuloo Hindi Dubbed Version Release Date Out Now - Sakshi

పాన్ ఇండియా చిత్రం 'పుష్ప‌'తో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మ‌రోసారి హిందీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ అల వైకుంఠ‌పుర‌ములో హిందీ డ‌బ్బింగ్ వ‌ర్ష‌న్‌ జ‌న‌వ‌రి 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఈ విష‌యాన్ని ప్ర‌ముఖ సినీ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించాడు. 'పుష్ప ప్ర‌భంజ‌నం త‌ర్వాత అల్లు అర్జున్‌ అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో మ‌రోసారి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాడు. తెలుగులో ఎంత‌గానో హిట్ అయిన‌ ఈ సినిమా హిందీ డ‌బ్బింగ్ వ‌ర్ష‌న్ జ‌న‌వ‌రి 26న రిలీజ్ కానుంది' అని పేర్కొన్నాడు.

2020వ సంవ‌త్స‌రంలో సంక్రాంతి కానుక‌గా రిలీజైన ఈ మూవీ ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాసింది. రాములా రాములా.., సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌.., బుట్ట‌బొమ్మ బుట్ట‌బొమ్మ‌.. పాట‌లు ఎంత సెన్సేష‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించిన ఈ మూవీ అక్క‌డ షెహ‌జాదాగా రీమేక్ అవుతోంది. బ‌న్నీ, పూజా హెగ్డే పాత్ర‌ల్లో కార్తీక్ ఆర్య‌న్‌, కృతి సనన్ క‌నిపించ‌నున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో టబు పాత్రలో బాలీవుడ్‌ నటి మనీషా కొయిరాల నటిస్తోంది. ప‌రిస్థితులు అనుకూలిస్తే ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివ‌ర్లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top