సూర్య హిట్‌ సినిమా అక్షయ్‌ కుమార్‌ రీమేక్‌.. ట్రైలర్‌ విడుదల | Akshay Kumar Sarfira Movie Official Trailer Out Now, Watch Video Inside Goes Viral | Sakshi
Sakshi News home page

Sarfira Movie Trailer: సూర్య హిట్‌ సినిమా అక్షయ్‌ కుమార్‌ రీమేక్‌.. ట్రైలర్‌ విడుదల

Jun 18 2024 12:50 PM | Updated on Jun 18 2024 1:25 PM

Akshay Kumar Sarfira Official Trailer Out Now


సౌత్‌ ఇండియా స్టార్‌ సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'ఆకాశమే నీ హద్దురా'. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ సినిమాను సుధా కొంగర దర్శకత్వం వహించారు. అయితే, ఇప్పుడు  'సర్ఫిరా' పేరుతో బాలీవుడ్‌లో రీమేక్‌ చేశారు. ఇందులో అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నారు.  రాధిక మదన్, పరేష్ రావల్ కీలక పాత్రలలో  కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ విడుదలైంది.

సూర్య నిర్మాతగా 2020లో  'ఆకాశమే నీ హద్దురా' చిత్రం డైరెక్ట్‌గా అమెజాన్‌ ‍ప్రైమ్‌లో విడుదలైంది. కానీ, సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడు కూడా సర్ఫిరా చిత్రానికి కూడా జ్యోతిక, సూర్య నిర్మాతలుగా ఉంటే సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. 

ఎయిర్‌ డెక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితంలోని పలు కీలక అంశాలను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సర్ఫరా ట్రైలర్‌ చూస్తూంటే అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఉంది. సూర్య కూడా ఇందులో ప్రత్యేక పాత్రలో కొంత సమయం పాటు కనిపిస్తారని తెలుస్తోంది. జులై 12 ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement