‘బెల్‌ బాటమ్’‌ టీజర్‌ విడుదల చేసిన అక్షయ్‌ | Akshay Kumar Released Bell Bottom Teaser | Sakshi
Sakshi News home page

‘బెల్‌ బాటమ్’‌ టీజర్‌ను షేర్‌ చేసిన అక్షయ్‌

Oct 5 2020 3:12 PM | Updated on Oct 5 2020 3:16 PM

Akshay Kumar Released Bell Bottom Teaser - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ప్రస్తుతం నటిస్తున్న చితరం ’బెల్‌ బాటమ్’‌. ఇటీవల ఈ చిత్రం స్కాట్లాండ్‌లో షూటింగ్‌ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్షయ్‌ ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ను సోమవారం ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకున్నాడు. దీనికి అక్షయ్‌ ‘గో బెల్‌ బాటమ్‌.. త్వరలో 80లోని థ్రిల్లింగ్‌ మీ ముందుకు వస్తుంది’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేశాడు. రంజిత్‌ ఎమ్‌ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్‌ రా(ఆర్‌ఏడబ్ల్యూ) ఎజెంట్‌గా నటిస్తున్నాడు. టీజర్‌లో అక్షయ్‌ 1980లోని బెల్‌ బాటమ్‌ సూట్‌ ధరించి.. విమానాశ్రయంలో విమానాల వైపు నడుస్తున్నట్లు కనిపించాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చిలో అమలైన లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడింది. (చదవండి: ప్రతి ఒక్కర్నీ దోషులుగా చూడకండి)

తిరిగి జూన్‌లో షూటింగ్‌లు ప్రారంభం కావడంతో చిత్ర తారాగణం అగష్టులో యూకే వెళ్లింది. అక్కడ షూటింగ్‌ ముగించుకుని తిరిగి సెప్టెంబర్‌ 30న ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో అక్షయ్ సినిమాకు సంబంధించిన‌ కొత్త పోస్టర్‌ షేర్‌ చేస్తూ.. ‘ఒంటరిగా మనం చాలా తక్కువ చేస్తాం. అదే ఒక టీంగా కలిస్తే చాలా చేయగలం. మా సినిమా సభ్యులు చాలా కృషి చేశారు. వారందరికి పేరు పేరునా కృతజ్ఞతలు. బెల్‌ బాటమ్‌ కంప్లీటెట్’‌ అంటూ ట్వీట్‌ చేశాడు. యూకే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంబంధించిన పోస్టు ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 20న విడుదల కానుంది. (చదవండి: మిషన్‌ ముగిసింది)

Advertisement
 
Advertisement
Advertisement