అజిత్‌తో రెండోసారి సెట్‌ అయినట్లేనా? | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: అజిత్‌తో రెండోసారి సెట్‌ అయినట్లేనా?

Published Wed, Mar 1 2023 9:32 AM

AK 62: Is Kajal Aggarwal Finalized in Ajith Movie, Deets Inside - Sakshi

ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమ దృష్టి అంతా నటుడు అజిత్‌ నటించే 62వ చిత్రంపైనే. దీనికి కారణం ప్రారంభానికి ముందే దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ను చిత్రం నుంచి తొలగించడం, ఆ స్థానంలో మగిళ్‌ తిరుమేణిని ఎంపిక చేయటం. దీనికితోడు చిత్ర షూటింగ్‌ను  3 నెలల్లోనే పూర్తి చేయాలని అజిత్‌ దర్శకుడికి ఆంక్షలు విధించినట్లు కూడా ప్రచారం సాగుతోంది.

చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

అదేవిధంగా లైకా ప్రోడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో హీరోయిన్‌ ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోవడం కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు వేగవంతమైనట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్‌గా ఐశ్వర్యారాయ్‌ నటించే అవకాశం ఉందని తొలుత ప్రచారం సాగింది. తర్వాత నయనతార, త్రిష పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ అవకాశాన్ని నటి కాజల్‌ అగర్వాల్‌ దక్కించుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు హోరెత్తుతున్నాయి.

చదవండి: పెళ్లి తర్వాత నయన్‌కు కలిసిరావడం లేదా?

ఈమె ఇంతకుముందు అజిత్‌ సరసన వివేకం చిత్రంలో నటించారు. శివ దర్శకత్వం వహించిన ఆ చిత్రం 2017లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా, కరోనా టైమ్‌లో నటి కాజల్‌ అగర్వాల్‌ పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తల్లి కూడా అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కమలహాసన్‌ సరసన ఇండియన్‌ 2, కరుంగాపియన్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అజిత్‌ 62వ చిత్రంలో కాజల్‌ నటించే విషయమై అధికారిక ప్రకటన త్వరలో వెలువనుందని తెలుస్తోంది.  

Advertisement
 
Advertisement
 
Advertisement