డార్లింగ్‌ హ్యాపీ బర్త్‌డే: ఐశ్వర్య రాయ్‌

Aishwarya Rai Rings Moms Birthday With Cakes Abhishek Bachchan And Aaradhya - Sakshi

అలనాటి అందాల హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్‌ ఇంట బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివారం (మే 23న) ఐశ్వర్య తల్లి వృందా రాయ్‌ 70వ వడిలోకి అడుగు పెట్టింది. కోవిడ్‌ వల్ల ఈ వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇంట్లోనే బర్త్‌డే పార్టీ ఏర్పాటు చేసింది. అయితే ఈ సెలబ్రేషన్‌లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఐశ్వర్య ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.

ఇందులో వృంద ఎదురుగా మూడు బ్యూటిఫుల్‌ కేకులతో పాటు అందమైన పూలు పరుచుకుని ఉన్నాయి. 'డార్లింగ్‌ మమ్మీకి హ్యాపీ బర్త్‌డే. నువ్వే మా ప్రపంచం. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం.. ఆ భగవంతుడు మా దేవతను చల్లగా చూడాలి' అని ఐశ్వర్య క్యాప్షన్‌ ఇచ్చింది. ఇక ఐశ్వర్య కూతురు ఆరాధ్య తన అమ్మమ్మను గాఢంగా హత్తుకున్న ఫొటోతో సహా భర్త అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటో అభిమానులను తెగ ఆకర్షిస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు పలువురూ ఐశ్వర్య తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చదవండి: ఆ రోజు రాత్రి ఐశ్వర్య ఇంటికి వెళ్లిన సల్మాన్‌.. దూకి చస్తానని బెదిరించి..

ఈ చిన్నారిని గుర్తుపట్టారా?.. ఇప్పడు ఆమె ఓ స్టార్‌ యాంకర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top