Trolls On Aishwarya Rai Over Her Birthday Wishes To Daughter Aaradhya Goes Viral - Sakshi
Sakshi News home page

Aishwarya Rai Bachchan: కూతురికి లిప్‌ కిస్‌.. ఐశ్వర్యపై నెటిజన్స్‌ ఫైర్‌

Nov 16 2022 3:28 PM | Updated on Nov 16 2022 5:42 PM

Aishwarya Rai Birthday Post For Daughter Aaradhya Goes Viral - Sakshi

బాలీవుడ్ స్టార్‌ కపుల్‌ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ముద్దుల కూతురు, లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ మనువరాలు ఆరాధ్య బచ్చన్  బర్త్‌డే నేడు(నవంబర్‌ 16). ఈ సందర్భంగా ఐశ్యర్య రాయ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. కుమార్తెకి ఆ విధంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని నెటిజన్స్‌ తప్పుబడుతున్నారు.  

(చదవండి:  సినిమాలకు బ్రేక్‌.. స్టార్‌ హీరో అనూహ్య నిర్ణయం)

ఇంతకీ ఐష్‌ పెట్టిన పోస్ట్‌ ఏంటంటే.. కూతురు బర్త్‌డేని పురస్కరించుకొని  ‘నా ప్రేమ.. నా ప్రాణం.. ఐ లవ్‌ యూ ఆరాధ్య’ అని పేర్కొంటూ ఆరాధ్యతో కలిసి ఉన్న ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో ఆరాధ్యకి ఐశ్వర్యరాయ్‌ లిప్‌ కిస్‌ ఇస్తూ కనిపించింది. కూతురి బుగ్గలపై, నుదుటిపై కాకుండా పెదవులపై ముద్దు పెట్టడాన్ని కొంతమంద నెటిజన్స్‌ తప్పుబడుతున్నారు. ఇది మన సంస్కృతి కాదు. వెస్ట్రన్‌ కల్చర్‌ అని, పబ్లిసిటీ కోసం ఇంత నీచంగా ఫొటోలు పెట్టాలా..? అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది మాత్రం ఆ ఫోటోలో తప్పే ఏముంది? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ‘బిడ్డపై తల్లికున్న స్వచ్ఛమైన ప్రేమ అది. ప్రతి విషయాన్ని వక్రదృష్టితో చూడడం మానండి' అని కామెంట్‌ చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement