ఐశ్వర్య రాయ్‌ బర్త్‌డే @ 50.. ఆమె పేరుతో ఫ్లవర్‌.. కోట్లల్లో సంపద | Sakshi
Sakshi News home page

Aishwarya @ 50: ఐశ్వర్య రాయ్‌ బర్త్‌డే.. ఆమె పేరుతో ఫ్లవర్‌.. కోట్లల్లో సంపద

Published Wed, Nov 1 2023 2:13 PM

Aishwarya Birthday Special Story - Sakshi

ఆమె అందాల రాశి, నీలి కళ్ల సుందరి, ప్రపంచ సుందరి ఇలా ఎన్నో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు ఉన్న ట్యాగ్‌లైన్స్‌.. నేడు ఆమె పుట్టినరోజు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కూడా వన్నె తరగని అందం ఆమె సొంతం. మిస్‌ వరల్డ్‌ కిరీటం కూడా ఆమె ధరించాకే దానికి విలువ పెరిగిందా అనేలా ఆమె సోయగం ఉంటుంది. అలా ఒక నటిగా, బచ్చన్‌ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా ఎప్పుడూ బాధ్యతలు మర్చిపోలేదు. నేడు నవంబర్‌ 1న ఆమె పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం...

ఐష్‌ స్వస్థలం కర్ణాటకలోని మంగుళూరు. ఆమె కాలేజీలో చదువుకునేప్పటి నుంచే మోడలింగ్ చేసేవారు. కొన్ని టీవీ ప్రకటనల్లోనూ నటించిన ఆమె, మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేత అయ్యి విశ్వసుందరిగా నిలిచారు. ఆ తరువాత ఆమె సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. 1997లో తమిళ సినిమా ఇరువర్ (ఇద్దరు)తో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. అదే సంవత్సరం హిందీలో ఔర్ ప్యార్ హో గయా సినిమాలో నటించారు. తమిళ్‌లో నటించిన జీన్స్ (1998) సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు ఐశ్వర్య.

సల్మాన్‌తో గొడవ.. అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి
అలా బాలీవుడ్‌లో కూడా ఆమెకు ఎదురు లేకుండా పోయింది. అక్కడ ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో ఐశ్వర్య నటించింది. 1999 నుంచి నటుడు సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేస్తూ వచ్చిన ఐశ్వర్య ఎప్పుడూ వార్తల్లోనే ఉండేవారు. 2002లో వీరిద్దరూ విడిపోయారు. తన గురించి అసభ్యంగా మాట్లాడి తనను అవమానించినందుకే ఆయనతో విడిపోయానని వివరించారు ఆమె.

ధూమ్2 సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్‌తో ఐశ్వర్య ప్రేమలో పడ్డారు. 14 జనవరి 2007న వారు నిశ్చితార్ధం చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ దానిని ధృవీకరించారు. 20 ఏప్రిల్ 2007న బంట్ సంప్రదాయం ప్రకారం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. పుట్టుకతో హిందువైన ఐశ్వర్యకు సంప్రదాయాలు, ఆచారాలు, భక్తి ఎక్కువ. 16 నవంబరు 2011న వీరికి ఒక పాప జన్మించింది. ఆమెకు ఆరాధ్య అని పేరు పెట్టారు.

50వ పుట్టినరోజు
ఈ సందర్భంలో, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈరోజు తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. స్క్రీన్ స్టార్ల అభిమానులుగా అందరూ ఆమెకు  అభినందనలు తెలుపుతున్నారు. ఈ సమయంలో మిస్ వరల్డ్‌గా కీర్తించబడుతున్న ఐశ్వర్యరాయ్ ఆస్తి సమాచారాన్ని ఒకసారి చూద్దాం.

దాదాపు మూడు దశాబ్దాలుగా నటిగా వెలుగొందుతున్న ఐశ్వర్యరాయ్ బచ్చన్ నికర విలువ రూ. 776 కోట్లుగా అంచనా వేయబడింది. ఆమె భారతీయ సినిమాలో అత్యంత ధనిక నటీమణులలో ఒకరిగా గుర్తించపడ్డారు. ముంబైలోని రూ. 112 కోట్ల విలువైన బంగ్లాలో తన కుటుంబంతో ఆమె కలిసి నివసిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఆమె ఒక సినిమాకు రూ. 10 కోట్ల నుంచి 12 కోట్లు తీసుకుంటుందని ప్రచారం ఉంది. ప్రకటనల కోసం అయితే సుమారు రూ. 6 కోట్ల రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం.

ఐశ్వర్య రాయ్‌ జీవితంలో ఇవన్నీ ప్రత్యేకం
► డాక్టర్‌ కావాలని యాక్టర్‌ అయిన ఐశ్వర్య.. కాలేజీ రోజుల్లో ఆమె పెప్సీ యాడ్‌ చేసింది. దీంతో వచ్చిన గుర్తింపుతో మోడలింగ్‌ వైపు వెళ్లింది
► 1994లో ఐష్‌ 'మిస్‌ వరల్డ్‌' కిరీటాన్ని సొంతం చేసుకుంది. అదే ఏడాది సుస్మితా సేన్‌ 'మిస్‌ యూనివర్స్‌'గా నిలిచింది.
► ఐశ్వర్యకు భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారు. ఈమె నటించిన 'జోధా అక్బర్‌' చిత్రంలో ఆమె లుక్‌ ఆధారంగా బార్బీ బొమ్మలను తయారు చేశారు.
► నెదర్లాండ్స్‌లోని క్యూకెనోఫ్‌ గార్డెన్‌లో ఉన్న తులిప్‌ పువ్వుల్లోని ఒక ప్రత్యేక జాతికి ఐశ్వర్య రాయ్‌ పేరు పెట్టారు.
► సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అంటే ఆమెకు ఎంతో ఇష్టం..ఆయనకు అభిమాని ఐశ్వర్య 

► 2009లో భారత ప్రభుత్వం 'పద్మ శ్రీ' అవార్డుతో ఐశ్వర్యను సత్కరించింది
► 2012లో ఆమెకు బ్రిటన్‌ ప్రభుత్వం 'ఆడ్రె డెస్‌ ఆర్ట్స్‌ ఎట్‌ డెస్‌ లెట్రెస్‌' పురస్కారాన్ని అందించింది.
► 2003లో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యురాలిగా ఐష్‌ వ్యవహరించారు. ఈ ఘనత దక్కిన తొలి భారతీయు నటి ఆమెనే
► 2007 ఏప్రిల్‌ 20న ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లకు వివాహమైంది. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement