Aryan Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్‌ వివాదం.. షారుక్‌ కలిసి సల్మాన్‌ ఖాన్‌

After Aryans arrest Salman Khan visits Shah Rukh Khan at his Home - Sakshi

ముంబై తీరంలో ఒక క్రూయిజ్ షిప్‌లో రేవ్‌ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) చేసింది. ఆ రైడ్‌లో షారుక్‌ ఖాన్‌ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ సహా మరికొందరు ప్రముఖుల పిల్లలను అరెస్టు చేయడం తెలిసిందే.

ఆర్యన్‌ అరెస్టు విషయం తెలిసిన పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు షారుక్‌కి మద్దతు తెలుపుతున్నారు.  ఆయన స్నేహితుడు, బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ఆదివారం రాత్రి దాదాపు 11 గంటల సమయంలో షారుక్‌ని కలవడానికి మన్నత్‌లోని బంగ్లాకు చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో పుటేజీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఈ కండల వీరుడు రేంజ్ రోవర్ కారు ముందు సీటులో కూర్చుని ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ ఇద్దరూ స్టార్స్‌ మధ్య ఏవో విభేదాలు ఉన్నట్లు రూమర్స్‌ ప్రచారం ఉన్నాయి. ఈ పరిణామంతో అవన్నీ పటాపంచలు అయిపోయినట్లైంది. కాగా డ్రగ్స్‌ వినియోగించినందుకు పలు సెక్షన్ల కింద ఆర్యన్‌తో పాటు మరికొందరిపై ఎన్‌సీబీ కేసు ఫైల్‌ చేసినట్లు సమాచారం.

చదవండి: అవన్నీ రూమర్స్‌ అంటూ కొట్టిపారేసిన నటి రియా చక్రవర్తి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top