వెండితెరపై మారాఠీ సాధువు కథ.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Aditya Oms Sant Tukaram Movie Release Date Out | Sakshi
Sakshi News home page

వెండితెరపై మారాఠీ సాధువు కథ.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Jul 15 2025 6:46 PM | Updated on Jul 15 2025 7:24 PM

Aditya Oms Sant Tukaram Movie Release Date Out

హీరో ఆదిత్య ఓం దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సంత్ తుకారం’. 17వ శతాబ్దపు మరాఠీ సాధువు-కవి భక్తిని ప్రతిఘటనగా మార్చిన సంత్ తుకారాం జీవితం, వారసత్వం, సాహిత్య విప్లవం ఆధారంగా ఆదిత్య ఓం ఈ ‘సంత్ తుకారం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ మరాఠీ నటుడు సుబోధ్ భావే టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. 

మరాఠీ, హిందీ సినిమాల్లో భావే తన అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించారు. ఇక ఇప్పుడు 17వ శతాబ్దపు సాధువైన సంత్ తుకారం పాత్రలో మెప్పించబోతోన్నారు. ఈ చిత్రం జూలై 18, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో శివ సూర్యవంశీ, షీనా చోహన్, సంజయ్ మిశ్రా, అరుణ్ గోవిల్, శిశిర్ శర్మ, హేమంత్ పాండే, గణేష్ యాదవ్, లలిత్ తివారీ, ముఖేష్ భట్, గౌరీ శంకర్, ట్వింకిల్ కపూర్, రూపాలి జాదవ్, DJ అక్బర్ సామి వంటి ప్రఖ్యాత నటులు కీలక పాత్రలకు జీవం పోశారు. ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకి హైలెట్ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement