నటి షనయా సోదరుని హత్యకేసు.. ఆ నివేదికే కీలకం | Actress Shanaya Brothers Assassination: DNA Report Become Crucial | Sakshi
Sakshi News home page

నటి షనయా సోదరుని హత్యకేసు.. ఆ నివేదికే కీలకం

Jun 12 2021 8:51 AM | Updated on Jun 12 2021 11:26 AM

Actress Shanayas Assassination: DNA Report Become Crucial - Sakshi

హుబ్లీ: వర్ధమాన సినీ నటి షనయ కాత్వే తన ప్రియుడు నియాజ్‌తో కలిసి సొంత సోదరుడు రాకేష్‌ను హత్య చేసిన కేసులో ఫోరెన్సిక్‌ నివేదిక కోసం హుబ్లీ పోలీసులు ఎదురుచూస్తున్నారు. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే ఆగ్రహంతో షనయ, నియాజ్, అతని మిత్రులతో కలిసి హత్య చేసినట్లు కేసు నమోదైంది.

గత ఏప్రిల్‌ 9న రాకేష్‌ను తీసుకెళ్లి హుబ్లీ రూరల్‌పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తారిహళ వంతెన వద్ద గొంతు పిసికి చంపారు. తరువాత శిక్ష నగరలో ఒక బాత్రూమ్‌లో మృతదేహాన్ని పెట్టారు. అల్తాఫ్, నియాజ్‌లు తల, మొండాన్ని వేరు చేసి కాల్చివేశారు. ఈ కేసులో షనయతో పాటు 8 మంది నిందితులను అరెస్ట్‌ చేయడం తెలిసిందే. ఆ మృతదేహం రాకేష్‌దే అని నిర్ధారించడానికి డీఎన్‌ఏ నివేదిక రావాల్సి ఉంది. ఆ నివేదిక వస్తే కేసు విచారణ చకచకా పూర్తవుతుందని పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement