నాన్న నేర్పిన జీవిత పాఠాల్లో ఇదీ ఒకటి: నటి | Actress Shabana Azmi Shared Old Pick With His Father On Instagram | Sakshi
Sakshi News home page

నాన్న నాకు నేర్పిన పాఠాల్లో ఇదీ ఒకటి: నటి

Aug 17 2020 6:12 PM | Updated on Aug 17 2020 7:29 PM

Actress Shabana Azmi Shared Old Pick With His Father On Instagram - Sakshi

ముంబై: నటి షబానా అజ్మీ తన జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకున్నారు. తన తండ్రి, ప్రఖ్యాత కవి, రచయిత కైఫీ అజ్మీతో కలిసి ఉన్న ఒక ఫోటోను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అజ్మీ ఆ పోస్ట్‌లో తాను నటి అవ్వలానుకున్నప్పుడు ఆమె నిర్ణయానికి తండ్రి మద్దతు తెలిపారని చెప్పారు. తన తండ్రి కైఫీ అజ్మీ తనకు నేర్పించిన అనేక జీవిత పాఠాలలో ఒక దానిని అభిమానులతో పంచుకున్నారు. ‘నేను నటిగా మారాలనుకుంటే మీరు నా నిర్ణయానికి మద్దతు ఇస్తారా అని అడిగాను. నువ్వు ఏం చేయాలనుకున్నా నేను మద్దతునిస్తాను. నువ్వు చెప్పులు కుట్టే వృత్తిని ఎంచుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు అన్ని నేర్చుకోవాలి. చెప్పులు కుట్టడంలో బెస్ట్‌ అనిపించుకోవాలి అని చెప్పారు. నాకు ఆయన నేర్పించిన జీవిత పాఠాలలో ఇదీ ఒకటి’ అని ఆమె పేర్కొన్నారు.  కైఫీ అజ్మీ 2002 లో మరణించిన విషయం తెలిసిందే. షబానా అజ్మీ పోస్ట్‌పై నటుడు ఫర్హాన్ అక్తర్ స్పందిస్తూ ‘వాట్ ఎ లవ్లీ పిక్చర్‌’ అని కామెంట్‌ చేశారు. అదేవిధంగా నటీమణులు నీనా గుప్తా, దివ్య దత్తా, అదితి రావు హైద్రాలి కూడా ‘చిత్రం చాలా అందంగా ఉంది’ అంటూ అభినందించారు. 

చదవండి: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలంటూ రజనీ ట్వీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement