గ్లామర్‌ని డ్రెస్‌తో కనెక్ట్‌ చేయకూడదు: సంయుక్తా మీనన్‌

Actress Samyuktha Menon Comments on her Movie Chances - Sakshi

‘‘భాష తెలియకుండా నటిస్తే చేసే పాత్రతో సగం కనెక్షన్‌ మిస్‌ అయిపోతాం. నా పాత్రకు వేరే వారు డబ్బింగ్‌ చెప్పడం నాకిష్టం ఉండదు. అందుకే లాక్‌డౌన్‌లో ట్యూటర్‌ని పెట్టుకుని తెలుగు నేర్చుకున్నాను’’ అన్నారు సంయుక్తా మీనన్‌. కల్యాణ్‌ రామ్‌ హీరోగా వశిష్ఠ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బింబిసార’. సంయుక్తా మీనన్, కేథరీన్‌ హీరోయిన్లుగా నటించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సంయుక్తా మీనన్‌ మాట్లాడుతూ – ‘‘నటిని అవుతానని అనుకోలేదు. అనుకోకుండా నటిగా అవకాశం రావడంతో సినిమాలు చేశాను. మలయాళంలో నేను చేసిన సినిమాలు నాకు మంచి గుర్తింపును తీసుకుని వచ్చాయి. దీంతో తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఫస్ట్‌ ‘బింబిసార’, ఆ తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం సైన్‌ చేశాను. ఆ నెక్ట్స్‌ పవన్‌ కల్యాణ్‌గారి ‘భీమ్లా నాయక్‌’, ధనుష్‌గారి ‘సర్‌’ చిత్రాలు అంగీకరించాను. ‘భీమ్లా నాయక్‌’, ‘సర్‌’ చిత్రాల ఆఫర్స్‌ ఒకేరోజు వచ్చాయి.

ఇక ‘బింబిసార’ టైమ్‌ ట్రావెల్‌ మూవీ. ఫ్లాష్‌బ్యాక్, ప్రెజెంట్‌ సిట్యువేషన్స్‌లో స్క్రీన్‌ ప్లే సాగుతుంది. ప్రెజెంట్‌ సాగే కథలో నేను కాస్త మోడ్రన్‌ పాత్రలో కనిపిస్తాను’’ అన్నారు.  ఇంకా మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఓ పెద్ద సినిమా చేస్తున్నాను. ఏ భాషలో సినిమా చేసినా ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలు చేయాలను  కుంటున్నాను. నా వస్త్రధారణ కాస్త నిండుగా   ఉంటుంది. నా తరహాలో నేను గ్లామర్‌గానే ఉన్నాను. గ్లామర్‌ను డ్రెస్‌తో కనెక్ట్‌ చేసి చూడటం అనేది తప్పని నా ఫీలింగ్‌’’ అని అన్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top